ఈ బ్లాక్ కలర్ ఫుడ్స్.. హార్ట్‌ ఆర్టరీస్‌కి బెస్ట్..!

ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

Update: 2024-11-06 13:49 GMT

దిశ, ఫీచర్స్‌: ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే గుండె పనితీరు క్రమంగా మారిపోతుంటుంది. దీని వల్ల గుండె ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నలుపు రంగులో ఉండే కొన్ని పదార్ధాలను మన రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.

బ్లాక్ బీన్స్: ఈ బ్లాక్ బీన్స్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బ్లాక్ బీన్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. నల్ల మిరియాలను కూడా వంటలో భాగం చేసుకుని తినొచ్చు.

బ్లాక్ బెర్రీస్: ఈ బ్లాక్ బెర్రీస్ రుచిగా ఉండటంతోపాటు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, పైబర్, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గించి, రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఈ బ్లాక్ బెర్రీస్‌ను తాజాగా లేదా పెరుగులో భాగం చేసుకుని తింటే మంచిది.

నల్ల నువ్వులు: నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం గుండెకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదనపు పోషణ కోసం ఈ నల్ల నువ్వులను సలాడ్ లేదా ఆహారంలో భాగం చేసుకుని తినవచ్చు.

నల్ల చియా విత్తనాలు: నల్ల చియా విత్తనాల్లో ఎక్కు పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా3 ఆకలిని నియంత్రించడంలో సహాయపడుుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని అద్బుతంగా కాపాడుతుంది. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

బ్లాక్ టీ: ప్రస్తుత రోజుల్లో సాధారణ టీకి బదులుగా బ్లాక్ టీని ఎంచుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ టీ కొలెస్ట్రాలను తగ్గించి, గుండె రక్తనాళాల కార్యకలాపాలను పెంచుతుంది. దీనిని రోజూ తాగడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చేస్తుంది.

ఈ ఆహార పదార్థాలు గుండెకు ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని ఎంతమోదాలో తీసుకోవాలో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News