తొక్కతో సహా ఉపయోగపడే ఆహార పదార్థాలు ఇవే!
సాధారణంగా ఎవ్వరైనా సరే పండ్లను, కూరగాయలను తీసుకునేటప్పడు వాటి తొక్కలను తీసేసి మిగతా భాగాన్ని తీసుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవ్వరైనా సరే పండ్లను, కూరగాయలను తీసుకునేటప్పడు వాటి తొక్కలను తీసేసి మిగతా భాగాన్ని తీసుకుంటారు. దాదాపు చాలా మంది ఇలాగే చేస్తారు. కానీ కొన్ని రకాల ఫుడ్‌ను తొక్కతో సహా తీసుకుంటేనే పోషకాలు అధికంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తొక్కల వల్ల కలిగే అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం..
* విటమిన్ ఈ, పోటేట్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కివి ఫ్రూట్ ప్రతి ఒక్కకరు కచ్చితంగా తొక్క తీసేసే తింటారు.
* ఈ పండును తొక్కతో పాటు తింటేనే గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు దరిచేరకుండా ఉంటాయి.
* వంకాయ కూర వండేటప్పుడు కొంతమంది పై తొక్కతో పాటు కట్ చేసి, కర్రీ చేస్తారు.
* కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే వంకాయను తొక్కతో పాటు తింటేనే మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
* నిమ్మకాయను పిండి నిమ్మరసం మాత్రమే వాడుతారు. కానీ పొటాషియం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తొక్కతో సహా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
*అలాగే రంగుతో, రుచితో అందరినీ ఇట్టే ఆకట్టుకేనే మామిడికాయ తొక్కలో ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్లు, ఎంజైమ్‌లు, విటమిన్ సి, ఇ వంటి విలువైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.
* మామిడికాయ తొక్కలు తీసుకొని పేస్టులాగా చేసి ఫేస్‌కు అప్లై చేస్తే.. ముడతలు తొలగిపోతాయి.
Also Read..
కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు తెలుసా..? వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?