Chanakya neeti : స్త్రీలు స్నానం చేయకుండా అస్సలే చేయకూడని పనులు ఇవేనంట?!
ఏ ఇంట్లో అయినా సరే స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అంంటారు. అంతే కాకుండా ఇంట్లోని మహిళలు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి ఇంటి పనులు ప్రారంభించాలి అంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.
దిశ, వెబ్‌డెస్క్ : ఏ ఇంట్లో అయినా సరే స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అంంటారు. అంతే కాకుండా ఇంట్లోని మహిళలు తెల్లవారు జామునే లేచి స్నానం చేసి ఇంటి పనులు ప్రారంభించాలి అంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడున్న జనరేషన్ మహిళలు తమ వర్క్ బిజీ వల్ల, ఉదయం స్నానం చేయకుండానే ఇంటి పనులు చక్కబెట్టేస్తున్నారు. కానీ ఇలా చేయకూడదంట. స్త్రీలు స్నానం చేయకుండా కొన్ని పనులు అస్సలే చేయకూడదంట అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏ స్త్రీ అయినా సరే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదంట. వాస్తు శాస్త్రం ప్రకారం మన పూర్వీకులు పూర్వీకుల దగ్గర నుంచి వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ దేవిగా భావిస్తారు. స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగించడం వల్ల లక్ష్మీ ఆగ్రహానికి గురై ఆ ఇంటిలోని వారు అనారోగ్యం బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పండితులు చెబుతున్నారు. అలాగే స్నానం చేయకుండానే, బీరువను అస్సలే ముట్టుకోకూడదంట, కొందరు స్నానం చేయుండానే బీరవలోని డబ్బులు తీస్తుంటారు. కానీ ఇలా అస్సలే చేయూడదంట. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయంట. అంతే కాకుండా స్నానం చేయకుండా తల దువ్వుకోవడం, తులసి చెట్టును తాకడం కూడా చేయకూడదంట.
Read more : అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు?