మొదటి సారి నెలసరి వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే

సాధారణంగా పది నుంచి పదకొండు ఏళ్ల మధ్యలో రావచ్చు.

Update: 2024-03-03 10:12 GMT

దిశ, ఫీచర్స్: మహిళలకు మొదటి నెలసరి వచ్చేందుకు నిర్ణీతమైన వయస్సు ఉండదు. సాధారణంగా పది నుంచి పదకొండు ఏళ్ల మధ్యలో రావచ్చు. అయితే, కొంతమంది అమ్మాయిలు 8 సంవత్సరాల వయస్సులోనే ఋతుస్రావం ప్రారంభమవుతుంది. పీరియడ్ అనేది నెలవారీ ప్రక్రియ. ఆడపిల్లల జీవితంలో నెలసరి చాలా ముఖ్యమైనది. నెలసరి సమయంలో యుటెరస్ పొర వదులుతుంటుంది. ఇది పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోయేలా చేస్తుంది. ప్రతి నెలా 4-5 రోజులు ఈ ప్రక్రియ తప్పకుండా ఉంటుంది. పీరియడ్స్ ప్రారంభమయ్యేందుకు ఉండే కనీస వయస్సు ఎంతని చాలామందికి సందేహాలుంటాయి. అయితే, దీనికి నిర్దిష్ట వయస్సు లేదు. ఇది పిల్లల మానసిక స్థితి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

హార్మోన్ల విడుదల, శరీర ఆకృతి, జీన్స్ వల్ల బాలికలు ప్రభావితమవుతారు. 8 నుండి 15 సంవత్సరాలు లేదా 10 నుండి 15 సంవత్సరాల వరకు అవుతుంటారు. మరి కొందరైతే 16 సంవత్సరాలకు కూడా అవ్వకపోవచ్చు. కొందరికి 8 ఏళ్లకే నెలసరి మొదలవుతుంది.

మహిళలకు మొదటిసారిగా రుతుక్రమం వచ్చినప్పుడు, వారికి తెలియదు. కొన్ని లక్షణాలు ఋతుస్రావం ముందు కనిపిస్తాయి. ఋతుస్రావం ముందు, వెజీనా నుండి రక్తం యొక్క చిన్న మచ్చలు చూడవచ్చు. ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. ఛాతీ, వెన్ను, వీపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. మొదటి పీరియడ్‌లో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత నెమ్మదిగా పునరుద్ధరించబడుతుంది. మీ మొదటి పీరియడ్ సమయంలో తక్కువ రక్తం కనిపిస్తుంది. రక్తస్రావం ఎక్కువైనా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


Similar News