సోషల్ మీడియాకు అడెక్ట్ అయ్యారా.. మీలో ఈ లక్షణాలు ఉంటే ప్రమాదంలో ఉన్నట్లే!

సోషల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇందులోనే లీనమై పోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అడెక్ట్ అయిపోయారు. తినకుండానైనా ఉండగలుగుతున్నారు

Update: 2024-06-02 09:40 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇందులోనే లీనమై పోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అడెక్ట్ అయిపోయారు. తినకుండానైనా ఉండగలుగుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా ఉండలేకపోతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వారు సోషల్ మీడియాలోనే జీవిస్తున్నారు. అయితే అసలు ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు వస్తాయో మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. కానీ దీని వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో చేసిన ఓ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో కంటిన్యూగా 3 గంటలు గడిపే టీనేజర్లలో యాంగ్జైటీ, కోపం, నిరాశ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయంట. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అంతే కాకుండా దీని వలన మరిన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఒక మనిషికి కంటినిండా ఆరోగ్యం అనేది చాలా అవసరం. సోషల్ మీడియాకి బానిసైపోవడం వలన ఎవరూ సరిగ్గా నిద్రపోవడం లేదు. అందువలన నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు వైద్యులు. సోషల్ మీడియాకు అడెక్ట్ అయిన వారు ఎటు కదలకుండా ఒకే చోట కూర్చొని లేదా పడుకొని వీడియోలు చూడటం లాంటివి చేస్తుంటారు. దీని వలన వారు విపరీతంగా బరువు పెరిగిపోయి, ఊబకాయం భారినపడే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా సోషల్ మీడియా వలన యూత్ తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారని, ఏ పని మీద ఏకాగ్రత పెట్టకపోవడం వలన తాము కొత్తగా ఏదీ నేర్చుకోలేకపోతున్నారు. ఇది వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News