ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట!

ప్రస్తుతం అంతా స్మారట్ ఫోన్ మయం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఫోన్ యూస్ చేస్తున్నారు. ఇక యూత్ అయితే ఫోన్‌లేకపోతే బతికి ఉండటమే వేస్ట్ అనుకునేలా తయారయ్యారు.

Update: 2023-04-25 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ మయం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఫోన్ యూస్ చేస్తున్నారు. ఇక యూత్ అయితే ఫోన్‌లేకపోతే బతికి ఉండటమే వేస్ట్ అనుకునేలా తయారయ్యారు. అంటే వారు స్మార్ట్ ఫొన్‌కు ఎంత అడెక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఉదయం లేచిందంట రాత్రి 12 అయినా ఫోన్ వదలడం లేదు. అయితే ఉదయాన్నే ఫోన్ చూడటం వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంట. అందువలన ఉదయం ఫోన్ చూడటం మానేయ్యాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, లేచిన వెంటనే ఫోన్ చూడటం వలన కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడటం వలన అది మన మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. ఒత్తిడి పెరుగుతుందంట. అంతే కాకుండా లేచిన వెంటనే ఫోన్ చూడటం వలన కళ్ల మీద ఎఫెక్ట్ పడుతుందంట. అలాగే డిప్రెషన్ వంటి సమస్యలు కలుగుతాయంట.అలాగే సోషల్ మీడియాలో మనం మునిగిపోయినప్పుడు మన మెదడు డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది. దాని వలన స్మార్ట్ ఫోన్‌కు అలావాటు పడిపోతామంట.

అంతే కాకుండా పుస్తకాలు చదివే వాళ్ళకంటే ఫోన్ ని ఉపయోగించే వాళ్ళ ఆలోచనలు బద్ధకంగా ఉంటాయని స్టడీ ద్వారా వెళ్లడైంది. అందువలన లేచిన వెంటనే ఫోన్ చూడకూడదంట.

Read more:

చేతులు శుభ్రం చేసుకోవడం.. అతీత శక్తుల పనేనా?

Tags:    

Similar News