వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?
వేసవి వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఏదైనా పని మీద బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ఈ రెండు రోజుల్లో వేడి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చేసింది. ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఏదైనా పని మీద బయటకు వెళ్లడానికి ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ఈ రెండు రోజుల్లో వేడి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది. అందువలన ఈ సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. కాగా, వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
వడదెబ్బ లక్షణాలు :
ఒళ్లు నొప్పులు
అలసట
మైకం
వికారం
కళ్లు తిరగడం
చెమట
తక్కువ మూత్ర విసర్జన
గుండె వేగంగా కొట్టుకోవడం
వాంతులు
స్పృహ కోల్పోవడం
అధిక దాహం
వడదెబ్బ తగల కుండా తీసుకోవాల్సిన జాత్రత్తలు
లేతరంగు దుస్తులను ధరించాలి, ముదురు రంగు దుస్తులు అస్సలే ధరించకూడదు.
వేడిగాలులు వస్తున్న సమయంలో అస్సలే బయట తిరగకూడదు.
మిట్టమధ్యాహ్నం బయట తిరగకూడదు.
బయటకు వెళ్లే సమయంలో వాటర్ బాటిల్ తప్పనిసరి.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే?
ప్రథమ చికిత్స మెడ, ముఖంపై ఐస్ ప్యాక్ పెట్టుకోండి. అలాగే ఒంటిపై దుస్తులను వదులు చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. అలాగే కొబ్బరినీళ్లు, చెరుకు రసం, పెరుగు, మజ్జిగ వడదెబ్బ నుంచి రక్షణ కలిపిస్తాయి. వడదెబ్బ లక్షణాలు ఎక్కువగా ఉంటే హాస్పిటల్ కు వెళ్లడం మంచిది.
Read more: