health problems : కదలకుండా కూర్చొని పని చేస్తున్నారా.. మీ కోసమే ఈ షాకింగ్ న్యూస్!

ప్రస్తుతం చాలా మంది డెస్క్ జాబ్స్‌కి అలవాటు పడిపోయారు. రోజూ ఉదయం ఆఫీసుకు రావడం డెస్క్‌లో కూర్చొని జాబ్ చేయడం, ఇంటికి వెళ్ళాక ఏ సోఫాలోనో, కూర్చీలోనో కదలకుండా కూర్చుని టీవీ చూడటం

Update: 2024-08-01 16:43 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది డెస్క్ జాబ్స్‌కి అలవాటు పడిపోయారు. రోజూ ఉదయం ఆఫీసుకు రావడం డెస్క్‌లో కూర్చొని జాబ్ చేయడం, ఇంటికి వెళ్ళాక ఏ సోఫాలోనో, కూర్చీలోనో కదలకుండా కూర్చుని టీవీ చూడటం చాలా కామన్ అయిపోయింది. ఇక ఉద్యోగం చేసేవారు తప్పకుండా 8 గంటలు కూర్చుని వర్క్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు కనీసం 10 నిమిషాలు కూడా నడవకుండా డ్యూటీ అయిపోయే వరకు చైర్ లో నుంచి లేవకుండా జాబ్ చేస్తుంటారు. కానీ ఇలా ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేయడం వలన అనేక సమస్యలు వస్తుంటాయంట. అవి ఏవంటే?

రక్తప్రసరణకు ఆటంకం : ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పని చేయడం వలన రక్త ప్రసరణ తగ్గుముఖం పడుతుంది. దీంతో కాళ్లలోకి నీరు చేరి కాళ్లవాపులు వస్తాయి. అంతే కాకుండా రక్తపు గడ్డలు కట్టడం వంటి సమస్యలు కూడా ఏర్పడుతాయి.

ఫైల్స్ : ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం వలన ఫైల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండె సమస్యలు : శారీరకంగా పని చేస్తూ ఉండే వారితో పోలిస్తే ఎలాంటి పని చేయకుండా కదలకుండా కూర్చుని పని చేయడం వలన గుండె జబ్బులు వస్తుంటాయి. గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరి గుండె పోటు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు వైద్యులు.

( నోట్ : పై వార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధ‌ృవీకరించలేదు)

Tags:    

Similar News