Patika Bellam: పట్టిక బెల్లం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

పట్టిక బెల్లం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Update: 2024-08-26 15:18 GMT

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి పటిక బెల్లం గురించి తెలిసే ఉంటుంది. ఇది దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది. ఇది చక్కెర కంటే చాలా మంచిది. పంచదార నుంచే పటిక బెల్లంను తయారు చేస్తారు. పంచదారను క్రిస్టల్ రూపంలోకి మార్చడం ద్వారా పటిక బెల్లం తయారవుతుంది. ఇది తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

జీర్ణక్రియ

పటిక బెల్లం జీర్ణక్రియ పని తీరును మెరుపరుస్తుంది. ఇది అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. దీనిని పాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.

రోగనిరోధక శక్తి

పటిక బెల్లంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వలన తలనొప్పి, గొంతునొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి.

రక్తహీనత

పటిక బెల్లంలో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలకు పీరియడ్స్‌ టైం తో వచ్చే సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

ఎముకలను బలపరుస్తుంది

దీనిలో ఉండే కాల్షియం ఎముకలు బలంగా అయ్యేలా చేస్తుంది. కీళ్ళు, నడుము నొప్పితో బాధ పడేవారు ఇది తినడం వలన అనేక లాభాలు కలుగుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News