రాస్బెరీలతో మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే..
మనలో కొందరు బ్రేక్ ఫాస్ట్ కి బదులు పండ్లను తీసుకుంటారు.
దిశ, ఫీచర్స్: మనలో కొందరు బ్రేక్ ఫాస్ట్ కి బదులు పండ్లను తీసుకుంటారు.. ఇలా రోజూ ఫ్రూట్స్ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉంటారు. వాటిలో రాస్బెరీలను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత తియ్యగా ఉంటాయి. రాస్బెరీలు ఫ్రెష్ గా దొరుకుతాయి .. కాబట్టి వీటిని ఎలా తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాం. వీటి వల్ల మన శరీరానికి కలిగే లాభాల గురించి ఇక్కడ చూద్దాం..
1. రాస్బెరీల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అంటే వయసు పెరిగే కొద్దీ మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. రాస్ప్బెర్రీస్ వాటి రూపాన్ని నిరోధిస్తాయి.
2. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులకు కూడా ఇది చెక్ పెడుతుంది.
3. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై తలెత్తే ప్రీ-రాడికల్ సమస్యలను తగ్గిస్తాయి. వృద్ధాప్యాన్ని నిరోధించడంలో ఇవి సహాయపడుతుంది. రాస్బెరీస్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.
4. రాస్బెరీల్లో ఫైబర్, పొటాషియం, ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇది గుండె పోటు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రాస్బెరీల్లో ను మనం ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుంది. మంచి రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.