మీరు యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఫాలో అయితే చాలు

కరోనా తర్వాత నుంచి మన జీవన విధానం మొత్తం మారిపోయింది.

Update: 2023-06-28 08:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా తర్వాత నుంచి మన జీవన విధానం మొత్తం మారిపోయింది. బయటకు వెళ్లాలన్నా, తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. వయస్సు పెరిగే కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మనలో చాలా మందికి యవ్వనంగా కనిపించాలని ఆశ పడుతుంటారు.. దాని కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

వ్యాయామం

ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రోజుకు 15 నుంచి 20 నిముషాలు వ్యాయామానికి సమయాన్ని కేటాయించండి.

 ఆహారం

వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.  

నిద్ర

ప్రతి రోజు రాత్రి 7-9 గంటలు నిద్ర అవసరం. యవ్వనంగా కనిపించాలంటే మంచి నిద్ర అవసరమని మర్చిపోకండి.

Read More:    ఉల్లిని ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవా..? 

Tags:    

Similar News