వర్షాకాలంలో తినాల్సిన ఆహారాలు ఇవే!

గత కొద్దీ రోజుల నుంచి అక్కడక్కడా వర్షాలు పడటంతో వేడిగా ఉన్న వాతావరణం చల్లబడింది.

Update: 2024-06-30 06:29 GMT

దిశ, ఫీచర్స్ : మొన్నటి వరకు ఎండలు బాబోయ్ అంటూ ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడిన ప్రజలకు వాతావరణం శాంతించడంతో కాస్తా రిలాక్స్ అవుతున్నారు. గత కొద్దీ రోజుల నుంచి అక్కడక్కడా వర్షాలు పడటంతో వేడిగా ఉన్న వాతావరణం చల్లబడింది. ఈ సమయంలో ఇమ్మ్యూనిటీ పెంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. లేదంటే సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి , మనం తినే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే.. రోగ నిరోధక శక్తిని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ, ఈ సమయంలో శరీరం నిర్జలీకరణం కావచ్చు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అల్లం, హెర్బల్ టీలు, సూప్‌లు శరీరానికి చాలా మంచివి. వీటి వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఆకు కూరలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ సీజన్‌లో కూరగాయలు పండించే ప్రాంతాలు అపరిశుభ్రంగా మారడంతో వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిది. వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణంలో, పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ ను తింటుంటారు. ఈ అలవాటు ఉన్నవారు వెంటనే దూరం పెట్టాలి. 


Similar News