ఎదిగే పిల్లలకు తప్పక ఇవ్వాల్సిన ఆహారాలు ఇవే.. ప్రోటీన్లు, విటమిన్లు ఫుల్

ఎదిగే పిల్లలకు సరైన పోషకాహారం తప్పనిసరి. లేకపోతే అది వారి భావి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే శారీర, మానసిక ఎదుగుదలకు తప్పక తినిపించాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.

Update: 2024-06-06 12:31 GMT

దిశ, ఫీచర్స్ : ఎదిగే పిల్లలకు సరైన పోషకాహారం తప్పనిసరి. లేకపోతే అది వారి భావి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే శారీర, మానసిక ఎదుగుదలకు తప్పక తినిపించాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పాలు ఒకటి. ఇందులో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 12 ఏళ్లలోపు పిల్లలకు ఒక గ్లాసు పాలు తాగించడం మంచిది.

పిల్లల ఆరోగ్యంగా ఉండటంలో విటమిన్ డి, ప్రొటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి కోడిగుడ్లలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే పిల్లలకు రోజూ రెండు ఉడకబెట్టిన గుడ్లు తినిపించాలి. దీంతోపాటు జీడిపప్పు కూడా చాలా ముఖ్యం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల జ్ఞాపక శక్తికి దోహదం చేస్తాయి. అట్లనే పచ్చి కూరగాయలలో బీన్స్ పిల్లల మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారంలో భాగంగా వీటిని తీసుకునేలా చూడాలి. వీటితోపాటు విటమిన్లు, ప్రోటీన్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలను పిల్లలకు తప్పక తినిపించాలి. 

 


Similar News