Salt water: పరిగడుపున సాల్ట్ వాటర్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
ప్రతి భారతీయుల వంటకాల్లో ఉప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి భారతీయుల వంటకాల్లో ఉప్పు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు ఉప్పు ఆరోగ్యాన్ని కాపాడటంలో మేలు చేస్తుంది. బాడీని ఫిట్‌గా ఉంచడంలో, ఆరోగ్యంగా ఉంచటానికి శరీరానికి సరైన సోడియం అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. పలు ఆహారాలను స్టోర్ చేయడానికి సాల్ట్‌ను వాడుతారు.
అయితే ఉప్పును పరిగడుపున తీసుకుంటే బోలెడన్నీ లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఓ చిటికెడు సాల్ట్ ను వాటర్‌లో వేసి.. నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ గోరువెచ్చటి వాటర్‌లో యాడ్ చేసి పరిగడుపున తాగితే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. చర్మ సమస్యలు తొలగిపోవడమే కాకుండా షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
సాల్ట్ వాటర్ వల్ల మంచి నిద్ర కూడా పొందవచ్చు. ఎండలో బయట తిరిగి వచ్చాక.. బాడీ డిహైడ్రేట్ అయితే ఒక గ్లాస్ సాల్ట్ వాటర్ తీసుకుంటే చాలు మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా నోట్లో ఉండే బాక్టీరియా నాశనమవుతుంది. 10 నిమిషాలు ఉప్పు నీటిలో పాదాలు ఉంచినట్లైతే పాదాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శ్వాసకోశంలో వాపు సమస్యతో బాధపడుతోన్న వారు సాల్ట్ వాటర్ తాగితే తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.