Bangles: మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలి ? రంగురంగుల గాజుల వెనుక ఉన్న అర్థమేంటి ?

Update: 2024-11-08 12:56 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావిస్తారు. పుట్టింది మొదలు.. పెళ్లి చేసి పంపేంత వరకూ.. పంపాక కూడా.. ప్రతి పండక్కి, ఫంక్షన్ కు ఆడపిల్లకు ఏమిచ్చినా ఇవ్వకున్నా.. గాజులు మాత్రం ఇస్తారు పుట్టింటివారు. మట్టిగాజులకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. చిన్నపిల్లలు గా ఉన్నప్పుడు మట్టిగాజులు వేస్తే.. అవి పగిలి ఎక్కడ గుచ్చుకుంటాయోనని ఫ్యాన్సీ గాజులు వేస్తారు. అసలు ఆడపిల్లలు గాజులు ఎందుకు వేసుకోవాలి ? వాటి వల్ల లాభమేంటి ? ఎప్పుడైనా ఆలోచించారా ? మన పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు కదా. గాజులెందుకు వేసుకోవాలో తెలుసుకుందాం రండి.

ఈ రోజుల్లో పాశ్చాత్య పోకడలకు పోయి చాలామంది యువతులు, మహిళలు గాజులు వేసుకోవడమే మానేశారు. కొందరు వేసుకున్నా.. ఏవో ప్లాస్టిక్ గాజుల్ని ధరిస్తున్నారు. సిటీల్లో ఉండేవారైతే.. గాజులు వేసుకుంటే ఎక్కడ పల్లెటూరి అమ్మాయిగా చూస్తారోనని పూర్తిగా మానేస్తున్నారు. ప్రత్యేకంగా పండుగలకు మాత్రం గాజుల్ని వేసుకుంటున్నారు. కానీ.. ప్రతిరోజూ చేతికి గాజులు వేసుకోవాలని హిందూ సంప్రదాయం చెబుతోంది. దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి.

చేతుల నిండా.. అంటే అరడజను గాజులు వేసుకుంటే.. అవి అటూ ఇటూ కదులుతూ శబ్ధం చేస్తుంటాయి. వీటివల్ల శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. మణికట్టు ప్రదేశాన్ని తాకుతుంటాయి కాబట్టి.. రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. రక్తనాళాలకు సహజంగానే మసాజ్ చేస్తాయి. అలసట ఎక్కువగా ఉండదు. శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

మట్టిగాజులు శరీరంలో వేడిని తగ్గిస్తాయట. ఎన్ని బంగారు గాజులున్నా.. కనీసం రెండు మట్టిగాజులైనా వేసుకోవాలంటారు అందుకే. హార్మోన్ల అసమతుల్యత రాకుండా ఉంటుంది. నేటితరం అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత పెరగడానికి గల కారణాల్లో మట్టిగాజులు వేసుకోకపోవడం కూడా ఒకటి అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగుతాయి.

ఎరుపురంగు మట్టిగాజులు వేసుకుంటే శక్తి, బ్లూ కలర్ మట్టి గాజులు విజ్ఞానాన్ని, గ్రీన్ కలర్ మట్టిగాజులు అదృష్టాన్ని, పసుపురంగు మట్టిగాజులు సంతోషాన్ని కలిగిస్తాయి. స్త్రీకి గాజులు కేవలం అందం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తారు. వీటిని చాదస్తంగా భావించకుండా.. సంప్రదాయాన్ని గౌరవించేలా చూడాలి. 

Tags:    

Similar News