Viral Video: లక్ అంటే నీదే బాసూ..! మరో క్షణంలో ప్రాణంపోయేది కానీ.. అంతలోనే..

అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మరికొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయంతోపాటు ఆశ్చర్యాన్ని, భయాన్ని, భావోద్వేగాన్ని ఒకేసారి కలిగిస్తూ జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్నిస్తుంటాయి.

Update: 2024-09-14 06:23 GMT

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మరికొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయంతోపాటు ఆశ్చర్యాన్ని, భయాన్ని, భావోద్వేగాన్ని ఒకేసారి కలిగిస్తూ జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్నిస్తుంటాయి. మూడవ రకానికి చెందిన సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ లక్ అంటూ నీదే బాసూ అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సందర్భంలో ఓ జేసీబీ కూడా రోడ్డుపై అతని పక్క నుంచి వెళ్తోంది. పరిస్థితి చూస్తుంటే అప్పుడు వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. వర్షం రావడానికి సూచనగా ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో బలమైన గాలి వీయడం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా రోడ్డుపై యువకుడి పక్కనుంచి వెళ్తున్న జేబీసీ‌లో డ్రైవర్ కూర్చునే షీట్ పైన నీడకోసం ఉండే టాప్ నుంచి ఓ ఐరన్ షీట్ ఊడిపోయి గాలిలో ఎగురుతూ వచ్చి యువకుడి తలపై పడబోతుండగా.. ఆ యువకుడు క్షణంలో అలర్ట్ అయ్యాడు.

ఐరన్ షీట్ మీదపడబోతుండగానే.. బైక్ మీద వెళ్తున్న యువకుడు కాస్త తలవంచి ముందుకు కదలడంతో పెద్ద ప్రాణాపాయమే తప్పింది. అదీగాక అతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నందున ఐరన్ షీట్ తలకు వెనుక భాగంలో తగులుగూ కిందకు జారిపోయింది. చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఆ యువకుడు పెను ప్రమాదం నుంచి బయటపడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. లక్ అదే నీదే బాసూ అంటూ రియాక్ట్ అవుతున్నారు. అతను హెల్మెట్ పెట్టుకోవడం కూడా మంచిదయింది అంటూ ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రోడ్డుపై వెళ్తు్న్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చూసి నేర్చుకోవాలని కూడా పలువురు పేర్కొంటున్నారు. 

Video Credits to safalbanoge on insta Id 


Similar News