పుట్టిన త‌ర్వాత మొద‌టి మాట అమ్మా..ఈ బుడ్డోడు మాత్రం డాగ్ అన్నాడు?! (వీడియో)

ఈ వీడియో కామెంట్లు, ఎమోజీల‌తో నిండిపోతుంది. The toddler said the word ‘dog’ as her first word and it is quite adorable to watch.

Update: 2022-06-06 13:16 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః తమ పిల్లల మొదటి మాటను తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుంచుకుంటారు. నిజానికి, ఆ క్ష‌ణం చాలా ప్రత్యేకమైన జ్ఞాపకాలలో ఒకటిగా మిగిలిపోతుంది. అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఒక పసిబిడ్డ తన తల్లి మాత్ర‌మే కాదు, ఇంట‌ర్నెట్‌లో అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా త‌న మొద‌టి మాట‌ను అన్నాడు. మే 28న dashleys ఖాతా ద్వారా Instagramలో ఈ వీడియో పోస్ట్ చేయ‌గా, ఇప్పటివరకు 2.3 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వ‌చ్చాయి. త‌న త‌ల్లి డాగ్స్‌కు భోజ‌నం పెడ‌దామా అని అంటూ శిశువును తీసుకెళ్ల‌గా, చిన్నారి డాగ్ అనే ప‌దాన్ని ప‌లుకుతాడు. అకస్మాత్తుగా పిల్లాడి నోటి నుండి వ‌చ్చిన మొద‌టి ప‌దం డాగ్ కావ‌డంతో త‌ల్లితో పాటు కుటుంబ స‌భ్యులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతారు. నెట్టింట్లో ఎంతో ముద్దుగా అనిపించిన ఈ వీడియో కామెంట్లు, ఎమోజీల‌తో నిండిపోతుంది. 


Similar News