అక్కడ నాలుగు నెలలు సూర్యుడు అస్తమించడు.. తెలుసా?
దిశ, ఫీచర్స్: ఐరోపాలో నాలుగు నెలల పాటు సూర్యుడు అస్తమించని ప్రదేశం ఉందని తెలుసా? Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఐరోపాలో నాలుగు నెలల పాటు సూర్యుడు అస్తమించని ప్రదేశం ఉందని తెలుసా? 'అర్ధరాత్రి సూర్యుని భూమి(ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్)'గా పిలువబడే ఈ ప్రదేశం నార్వేలో ఉండగా.. ఆర్కిటిక్ సర్కిల్‌లోని స్వాల్‌బార్డ్‌లో ఈ దృగ్విషయం చోటు చేసుకుంటుంది. VisitNorway వెబ్‌సైట్ ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ 20, ఆగస్టు 22 మధ్య ఈ వింత సంభవించనుండగా.. ఆ సమయంలో అక్కడి అటవీ ప్రాంతాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు పర్యాటకులు.
ఉత్తర ధృవం, నార్వే మధ్యన సగం దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో.. అర్ధరాత్రి పూట వేల్ సఫారీకి వెళ్లేందుకు లేదా అరణ్యాన్ని అన్వేషించేందుకు సిఫార్సు చేస్తారు. అంతేకాదు గోల్ఫింగ్, సైక్లింగ్, రివర్ ప్యాడ్లింగ్ లేదా సముద్ర కయాకింగ్, చేపలు పట్టడానికి కూడా అనుకూలమైన నిశ్శబ్ద ప్రదేశాన్ని కనుగొనవచ్చు. పైగా ధృవపు ఎలుగుబంట్లు నివసించే స్వాల్‌బార్డ్ దీవులతో పాటు ఆధునిక పట్టణం లాంగ్‌ఇయర్‌బైన్‌కు సంబంధించిన కల్చర్ ఈ టైమ్‌లో మరింత అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్స్ అండ్ బార్స్.. దీవుల ఆర్కిటిక్ స్వభావం, గొప్ప వన్యప్రాణులు, పాత మైనింగ్ పట్టణాలను అన్వేషించవచ్చని అక్కడి పర్యాటక శాఖ ప్రకటించింది.