ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేసుకుంటారా?.. వధూ వరులు చేసిన ఆ పనికి అందరూ షాక్ ! (వీడియో)
భారతీయ సంప్రదాయంలో పెళ్లంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఏ ఇంట్లో అయినా పెళ్లి జరుగుతుందంటే నెలరోజుల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఈ శుభకార్యం జరిగే ఇంటికి వారం, పది రోజులు ముందుగానే చేరుకొని పెళ్లి పనులకు సహకరించేవారు.
దిశ, ఫీచర్స్ : భారతీయ సంప్రదాయంలో పెళ్లంటే ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఏ ఇంట్లో అయినా పెళ్లి జరుగుతుందంటే నెలరోజుల ముందు నుంచే హడావిడి మొదలయ్యేది. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఈ శుభకార్యం జరిగే ఇంటికి వారం, పది రోజులు ముందుగానే చేరుకొని పెళ్లి పనులకు సహకరించేవారు. మ్యారేజ్ అయిపోయే వరకు పెళ్లి వారింట్లో సందడి నెలకొనేది. ఆత్మీయుల పలకరింపులు, అనుబంధాలు, ఆనందాల మధ్య ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ సంతోషాలు, సరదాలు మరో రూపాన్ని సంతరించుకున్నాయి. అలాంటి ఆధునిక మార్పుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి.
పెళ్లికంటే ముందే వరుడు, వధువు, ఇరువైపులా కుటుంబ సభ్యులు తమకు నచ్చిన వెకేషన్ స్పాట్స్‌కు వెళ్లి, నచ్చినట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అయితే కొందరు అందరినీ ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ప్రీ వెండ్డింగ్ షూట్‌ను కూడా వెరైటీగా ట్రై చేస్తున్నారు. అలా ఒక జంట చేసిన వెరైటీ వెడ్డింగ్ షూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వధువు, వరుడు కలిసి చేసిన పనికి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారంటే.. వధూ వరులు బైక్‌పై కూర్చొని ఉండగా, క్రేన్ సహాయంతో అచ్చం సినిమా షూటింగ్ మాదిరి ఒక స్టంట్ నిర్వహించారు. జంట కూర్చొని ఉన్న బైక్ ఒక ఫోర్ వీలర్ మీది నుంచి అవతలి వైపునకు వెళ్లే విధంగా షూట్ చేసిన ఈ వీడియోను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనే యూజర్‌లో ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వెరైటీ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం అవసరమా? ప్రీ వెడ్డింగ్ షూట్ వెర్రితలలు వేస్తోంది అంటూ రియాక్ట్ అవుతున్నారు.