Caffeine : బ్లడ్‌లో కెఫిన్ లెవల్స్ పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా?

రక్తంలో కెఫిన్ లెవల్స్ బాడీ ఫ్యాట్స్ అండ్ డయాబెటిస్‌పై ఎఫెక్ట్ చూపుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2023-08-23 06:24 GMT

దిశ, ఫీచర్స్: రక్తంలో కెఫిన్ లెవల్స్ బాడీ ఫ్యాట్స్ అండ్ డయాబెటిస్‌పై ఎఫెక్ట్ చూపుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో భాగంగా స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు ఇప్పటికే జెనెటిక్ డేటాబేస్‌ల నుంచి సేకరించిన దాదాపు వెయ్యిమంది వ్యక్తుల డేటాను పరిశీలించారు.

కెఫిన్ విచ్ఛిన్నమయ్యే వేగంతో సంబంధం కలిగి ఉన్న విభిన్న జన్యువులలో తేడాలపై ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా వారు బ్లడ్‌లో నిక్షిప్తమై ఉండే కెఫిన్ లెవల్స్ ఒక వ్యక్తి బాడీలోని ఫ్యాట్ పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అంతేగాక ఇది టైప్ 2 డయాబెటిస్ అండ్ కార్డియో వాస్క్యులర్ డిసీజెస్‌ను డెవలప్ చేసే రిస్క్‌ను పెంచుతాయని పేర్కొన్నారు. అయితే క్యాలరీలు లేని కెఫిన్ పానీయాలు మాత్రం శరీరంలోని ఫ్యాట్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు.

Tags:    

Similar News