ఆగిన గుండె ఐదు గంటల తరువాత కొట్టుకుంది

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో 76 ఏళ్ల బెల్లా మోంటోయాకు గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు.

Update: 2023-06-17 10:28 GMT

దిశ, వెబ్​డెస్క్​ : దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌లో 76 ఏళ్ల బెల్లా మోంటోయాకు గుండెపోటు రావడంతో ఆమె చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. దాంతో ఆమె మృతదేహాన్ని శవపేటికలో ఉంచారు. ఐదు గంటల తరువాత, శ్మశానానికి తీసుకెళ్లే ముందు ఆమెకు బట్టలు మారుద్దామని చూస్తే ప్రాణం ఉంది. ఊపిరి ఆడుతోంది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమెకు కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ వచ్చిందని,

     గుండె పనిచేయడం ఆగిపోయి, శ్వాస ఆగిపోయిందని, బతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయిందని డాక్టర్లు తెలిపారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. తరువాత బెల్లా మోంటోయాను శవపేటికలో ఉంచారు. కొన్ని గంటల తరువాత కుటుంబ సభ్యులకు ఆమెకు ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపించింది. ఈ వీడియోలు కూడా సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేకుండాపోయింది. 

ఇవి కూడా చదవండి: గుండె జబ్బులకు కారణమవుతున్న సుగంధ ద్రవ్యాలు..


Similar News