రెండోవ సూర్య గ్రహణం.. ఈ సారైనా భారత దేశంలో కనిపిస్తుందా.. లేదా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
హిందూ సంప్రదాయంలో గ్రహాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
దిశ, ఫీచర్స్ : హిందూ సంప్రదాయంలో గ్రహాణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. వీటిని చెడుగా పరిగణిస్తారు. నేటి కాలంలో కూడా చాలా మంది ప్రజలు వీటిని అశుభ సూచకంగానే భావిస్తారు. గ్రహణం పట్టే సమయం దగ్గర నుంచి ముగిసే వరకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని అందరూ పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్రుడు, సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు సూర్య కాంతి భూమిపైన కనిపించక పోవడం వలన సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవించింది. అయితే, మన దేశంలో తప్ప మిగతా దేశాల్లో ఈ గ్రహణం కనిపించింది. తాజాగా, రెండోవ సూర్యగ్రహణం గురించి కొంత మందికి కొత్త సందేహాలు మొదలయ్యాయి. రెండో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ సారైనా భారతదేశంలో కనిపిస్తుందా లేదనే దానిపై గూగుల్ లో తెగ వెతుకుతున్నారు. అయితే, దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో.. ఇక్కడ చూద్దాం..
2024లో సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది?
2024లో రెండోవ సూర్యగ్రహణం అక్టోబర్ 2, 2024 బుధవారం రోజున ఏర్పడనుంది. రాత్రి 9:10 గంటల నుండి మొదలయ్యి ఉదయం 03:17 వరకు ఉంటుంది. అంటే, సూర్యగ్రహణం దాదాపు 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది.
ఈ సారైనా భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా?
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఇక ఈ సంవత్సరంలో ఏర్పడే రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఈ సూర్యగ్రహణం ఏర్పడడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
.