ఇటు తల్లి.. అటు మామ, కూతురు,భర్త.. అందరి మధ్యలో నలిగిపోతున్న మహిళ

45ఏళ్ల రుక్మిణి తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి అనారోగ్యం పాడైపోయింది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి

Update: 2024-04-16 11:09 GMT

దిశ, ఫీచర్స్: 45ఏళ్ల రుక్మిణి తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి అనారోగ్యం పాడైపోయింది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి రుక్మిణి మాత్రమే సంతానం కావడంతో తన ఫ్లాట్‌కు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇక 21ఏళ్ల ఆమె పాప జాబ్ సెర్చ్‌లో ఉండటంతో తనకు కూడా హెల్ప్ చేస్తుంది. మరోవైపు తన మామ ఇంతకు ముందు ముంబైలో సింగిల్‌గానే ఉండేవాడు కానీ కింద పడిపోవడంతో భర్త తనను కూడా ఇంటికి తీసుకొచ్చేశాడు. పైగా తాము పెట్ లవర్స్ కావడంతో కుక్కలను కూడా పెంచుతున్నారు కాబట్టి ఇల్లు సరిపోవడం లేదు. దీంతో ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ బాధపడాల్సి వస్తుంది. ఆమె తన హజ్బెండ్‌ ఎప్పుడూ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతూ ఉండిపోవాల్సి వస్తుంది. నవ్వడానికి టైమ్ లేదు.. నవ్వించే వాళ్లు లేరు.


దాదాపు 40-50ఏళ్ల మధ్య వయసున్న చాలా మంది ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, అత్తామామలు, పిల్లల బాధలు, బాధ్యతలను పంచుకుంటూ నలిగిపోతున్నారు. అసంతృప్తి, చిరాకు, ఏదో కోల్పోయిన భావనతో ఉండిపోతున్నారు. తమ పిల్లలను, పెద్దలను సరిగ్గా చూసుకుంటున్నామా లేదా అనే భయం వెంటాడుతుండగా.. బాధతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. దీనినే ‘శాండ్‌విచ్ జనరేషన్’ అంటున్న నిపుణులు.. ఈ పదాన్ని ముందుగా 1981లో సోషల్ వర్కర్స్ డొరొతీ మిల్లర్, ఎలైన్ బ్రాడీ వినియోగించినట్లు చెప్తున్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఈ పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. పేరెంట్స్, చిల్డ్రన్స్‌నే కాదు గ్రాండ్ చిల్డ్రన్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ‘క్లబ్ శాండ్‌విచ్ జనరేషన్’గా ఈ ఏజ్‌ గ్రూప్‌ను పిలుస్తుంటారు.


నిజానికి మల్టీ జనరేషన్ కేర్ అనేది చాలా కఠినం. కానీ దీని గురించి మాట్లాడేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. బాధ్యతల నుంచి తప్పుకున్నామనే మాట వస్తుందనే భావనతోనే ఇలా ఉండిపోతుండగా.. వారిపై రోజురోజుకు పెరిగిపోతున్న అంచనాలు దంపతుల మధ్య వివాదాలకు కారణం అవుతున్నాయి. నిరంతరం అదే పనిలో ఉండటం హైపర్ విజిలెన్స్‌కు దారితీస్తుండగా.. వారి జీవన నాణ్యత దెబ్బతింటుంది. ఒత్తిడి, సహనం నశించిపోతుంది. అసలు దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కానీ సిచ్యుయేషన్స్ ఎదురవుతున్నాయి. అందుకే దీనిపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉండేలా కమ్యూనికేట్ కావాలని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఆర్థికపరమైన విషయాలపై చర్చ జరగడంతోపాటు ఎవరు ఎలాంటి బాధ్యత తీసుకోవాలో ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే అందరూ సెల్ఫ్ కేరింగ్‌కు స్పేస్‌ను మెయింటెన్ చేయగలరని చెప్తున్నారు.


Similar News