Gutti Dondakaya: అదిరిపోయే గుత్తి దొండకాయ కూర రెసిపీ.. ఇలా ఈజీగా చేసేయండి

గుత్తి దొండకాయ కూర రెసిపీ

Update: 2024-07-28 10:47 GMT

దిశ, ఫీచర్స్ : గుత్తి వంకాయ కూర మనం వినే ఉంటాము. ఈ గుత్తి దొండకాయ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. దొండకాయ తింటే మతిమరుపు వస్తుందనే అపోహ పక్కన పెట్టి ఈ కూరను ఒకసారి ట్రై చేయండి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. గుత్తి దొండకాయ కూరను అనేక విధాలుగా వండుకోవచ్చు. కొన్ని చోట్ల ఈ కూరను పులుసు లాగా చేసుకుంటారు. గుత్తి దొండకాయ కూర రెసిపీ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

గుత్తి దొండకాయలు - 200 గ్రామ్స్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు , 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, దాల్చిన చెక్క 2, లవంగాలు 4, ఒక ఉల్లిపాయ, చింతపండు, 1 టీ స్పూన్ అల్లం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత.

తయారీ విధానం

ముందుగా దొండకాయలను బాగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకుని వాటిలో ఉప్పు, పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో శనగపప్పు, నువ్వులు, లవంగాలు వేసి బాగా వేయించి మిక్సీ పట్టి పొడి లాగా చేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం, చింతపండు వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసుకుని, దొండకాయ ముక్కలను వేసి 3 నిముషాలు వేయించండి. వేయించిన దొండకాయలకు మసాలా, పెరుగు పట్టించి బాగా కలుపుకోండి. అంతే గుత్తి దొండకాయ కూర రెడీ

Tags:    

Similar News