విచిత్ర రైల్వే స్టేషన్.. అక్కడికి వెళ్లగానే ఏం జరుగుతుందంటే..

రైల్వే స్టేషన్ అనగానే చాలామందికి జనాలతో కిటకిటలాడే సందడి వాతావరణం గుర్తుకొస్తుంది. రైళ్లల్లో ప్రయాణించేవారికి ఇదొక మంచి అనుభూతిని ఇస్తుంది. సిటీస్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారైతే రెండు మూడు గంటలు ముందుగానే వెళ్లి రైల్వే స్టేషన్‌లోని వాతావరణాన్ని ఆస్వాదించాలని భావిస్తారు.

Update: 2024-05-29 13:26 GMT

దిశ, ఫీచర్స్ : రైల్వే స్టేషన్ అనగానే చాలామందికి జనాలతో కిటకిటలాడే సందడి వాతావరణం గుర్తుకొస్తుంది. రైళ్లల్లో ప్రయాణించేవారికి ఇదొక మంచి అనుభూతిని ఇస్తుంది. సిటీస్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారైతే రెండు మూడు గంటలు ముందుగానే వెళ్లి రైల్వే స్టేషన్‌లోని వాతావరణాన్ని ఆస్వాదించాలని భావిస్తారు. దాదాపు ఈ వెదర్‌ను జర్నీ చేసేవారందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ మాత్రం ప్రయాణికుల్లో కన్‌ఫ్యూజ్‌ క్రియేట్ చేస్తుంది. ఈ విచిత్రమైన రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రం బీర్భూమ్ జిల్లాలోని వార్ద్ కలాం దగ్గర ఉంది. అందరూ సైథియా స్టేషన్ అని పిలుస్తుంటారు.

సైథియా రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు చాలామంది గందరగోళానికి గురవుతుంటారట. ఎందుకంటే ఇక్కడికి రావాలంటే అహ్మదాపూర్ రైల్వే స్టేషన్(జంక్షన్‌)లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వద్ద దిగి, ప్లాట్‌ఫారమ్ నంబర్ 2కి వెళ్తేనే సైథియా రైల్వే స్టేషన్‌లోకి చేరుకుంటారు. అంటే ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం జస్ట్ సెకన్లు మాత్రమే. అయినా అహ్మద్ పూర్ జంక్షన్, సైథియా రైల్వే స్టేషన్ అనే రెండు ప్లాట్‌ఫారమ్‌లకు వేర్వేరు పేర్లు, వేర్వేరు యాజమాన్యాల నిర్వహణలో ఉండటంతో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారట. 


Similar News