ఆకాశంలో మరో చంద్రుడు.. అంతరిక్ష కొత్త అధ్యయనంలో సంచలనం
భూమికి ప్రస్తుతం ఉన్న చంద్రుడు కాకుండా మరో చంద్రుడు రాబోతున్నాడు. దీని కారణంగా భూమికి అమావాస్య కూడా వస్తుందని.. ఇది భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుందని.. ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: భూమికి ప్రస్తుతం ఉన్న చంద్రుడు కాకుండా మరో చంద్రుడు రాబోతున్నాడు. దీని కారణంగా భూమికి అమావాస్య కూడా వస్తుందని.. ఇది భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుందని.. ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతరిక్ష పరిశోధకులు హవాయిలోని Pan-STARRS టెలిస్కోప్ సాయంతో 2023 FW13 అనే పాక్షిక చంద్రుడిని కనుగొన్నారు. వీరి ప్రకారం.. అంతరిక్షంలో మరో చంద్రుడు వచ్చాడు. ఈ చంద్రుడు పాక్షిక చంద్రుడు. పాక్షిక-చంద్రుడు భూమి, సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఒక అంతరిక్ష శిల (గ్రహశకలం).
కానీ సూర్యుని గురుత్వాకర్షణతో కట్టుబడి ఉంటుందని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీరి ప్రకారం.. ఈ పాక్షిక చంద్రుడు.. రాబోయే 1500 సంవత్సరాల పాటు, అంటే క్రీ.శ. 3700 వరకు భూమి చుట్టూ తిరుగుతుంది. దీని తర్వాత, ఇది భూమి యొక్క కక్ష్య నుంచి బయలుదేరుతుంది. దీని వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2023 FW13 సూర్యుని చుట్టూ భూమి ఎంత సమయం తీసుకుంటుందో (365 రోజులు) అదే సమయంలో తిరుగుతుంది.
Read More: యూరిన్‌తో వెలిగే లైట్.. ఒక్కసారి నింపితే 45 రోజులపాటు వెలుగులు