ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రింక్.. అంతగా ఏముంది అందులో?
ఈ ప్రపంచంలో చాలా రకాల డ్రింక్స్ ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఈ ప్రపంచంలో చాలా రకాల డ్రింక్స్ ఉంటాయి. ఒక్కో డ్రింక్‌కు ఒక్కో ధర ఉంటుంది. సాధారణంగా అయితే రూ. 500 లేదా రూ. 1000.. లేకపోతే 2000 రూపాయలు ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ప్రపంచంలోనే భారీ ధర గల ఓ డ్రింగ్ ఉంది. అదేంటంటే..? లైవ్ ఫిష్ డ్రింక్. ఈ డ్రింక్ అంటే జపానీస్ చాలా ఇష్టపడుతారు. ఈ డ్రింక్ కప్పులో 200 చేపలు ఉండటం విశేషం. పైగా చేపలన్నీ సజీవంగా ఉండటం గమనార్హం. ఈ డ్రింక్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధరగల డ్రింక్ గా పేరు గాంచింది.
అయితే ఈ లైవ్ ఫిష్ డ్రింక్ ఒక కప్పుకు $ 60 ఉంటుందట. అంటే మన ఇండియా కరెన్సీలో 5000 రూపాయలు అని అర్థం. దీన్నే డ్యాన్సింగ్ ఈటింగ్ అని పిలుస్తారట. అతి చిన్న సైజ్ లో ఉండే చేపల్ని సోయా సాస్ తో తయారు చేసిన పదార్థాలతో మిక్స్ చేసుకుని అవి సజీవంగా ఉన్నప్పుడే తాగేతారట. చిన్న సిల్వర్ చేపలకు బ్యాక్టీరియా ఉండదట. ఈ డ్రింక్ సేవిస్తున్నప్పుడు ఫిషెస్ కప్ నుంచి ఎగిరి కిందపడతాయట. కాగా కిందకు పడకుండా జాగ్రత్తగా తాగే ట్రిక్ కూడా ఉంటుందని, దాన్ని ఒక ఆర్ట్ అంటారని జపనీయులు చెబుతున్నారు. ఇది మంచి రుచిని ఇవ్వడంతో పాటు శరీరంలో ఉత్సాహాన్ని నింపుతుందట.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.