నాయకత్వ శైలిలో వైవిధ్యం.. ఎవరు ఎలా ప్రవర్తిస్తారంటే..

చాలామంది తామున్న రంగంలో లీడర్‌షిప్ లెవల్‌కి ఎదగాలనుకుంటారు. ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకుంటారు. నాయకత్వ శైలిని, లక్షణాలను అలవర్చుకునే విషయంలో, పనితీరులో భిన్నత్వం ఇందుకు కారణం కావచ్చు.

Update: 2024-02-09 13:22 GMT

దిశ, ఫీచర్స్ : చాలామంది తామున్న రంగంలో లీడర్‌షిప్ లెవల్‌కి ఎదగాలనుకుంటారు. ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకుంటారు. నాయకత్వ శైలిని, లక్షణాలను అలవర్చుకునే విషయంలో, పనితీరులో భిన్నత్వం ఇందుకు కారణం కావచ్చు. సమర్థవంతమైన వ్యక్తులు లీడర్లుగా ఎదిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వీరి వ్యక్తిగత పనితీరు, ఆర్గనైజింగ్ వర్కింగ్ స్టైల్, నిజాయితీ, నిబద్ధత ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. గోల్స్ సాధించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. నిపుణుల ప్రకారం.. లీడర్‌గా ఉండే వ్యక్తుల్లో కనిపించే అత్యంత ప్రజాదరణ పొందిన సాధారణ నాయకత్వ శైలి ఏమిటి?, ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం.

లావాదేవీల నిర్వహణ శైలి

లావాదేవీల నిర్వహణ నాయకత్వ శైలి కలిగినవారు తరచూ లక్ష్యాలపై, సామర్థ్యంపై సూక్ష్మంగా కేంద్రీకరిస్తూ ఉంటారు. తమ పరిధిలోని జట్టు సభ్యులకు అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, ట్రైనింగ్‌లతో ప్రోత్సహిస్తారు. మైక్రోమేనేజ్ మేనేజ్‌పై ప్రధానంగా ఫోకస్ పెడుతుంటారు. అవసరం అయినప్పుడు రియాక్షనరీగా ఉంటారు. అథారిటీని ప్రశ్నించరు. కార్పొరేట్ స్ట్రక్చర్‌కు వాల్యూ ఇవ్వడంతోపాటు వర్క్ విషయంలో ఆచరణాత్మకంగా ఉంటారు. సృజనాత్మక వాతావరణంలో ఈ రకమైన లీడర్ అంత బెస్ట్‌గా ఉండడు. స్వల్పకాలిక లక్ష్యాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో ఈ రకమైన నాయకత్వం దీర్ఘకాలిక వ్యూహం ప్రాముఖ్యతను విస్మరిస్తుంది.

బలాలు, బలహీనతల అంచనా

కోచింగ్ లీడర్‌షిప్ స్టైల్ కలిగిన నాయకులు తమ టీమ్ మెంబర్స్‌ బలాలు, బలహీనతలను అర్థం చేసుకుంటారు. అవసరమైన విషయాల్లో ప్రోత్సహిస్తుంటారు. సహజంగా అర్థం చేసుకుంటాడు. ఈ అవగాహనతో వీరు స్పష్టమైన, సాధించగల లక్ష్యాలను నిర్దేశించగలరు. పాజిటివ్ మోటివేటింగ్ ఎన్విరాన్ మెంట్‌ను క్రియేట్ చేయగలుగుతారు. అందుకే దీనిని విలువైన నాయకత్వ శైలిగా నిపుణులు పరిగణిస్తారు. ఇందుకు కారణం సదరు వ్యక్తులో ‘హ్యాండ్-ఆన్’ అప్రోచ్ అండ్ ఎఫోర్ట్స్, అంటే విధాన రూపకల్పన, కృషి ముఖ్యమైన లక్ష్యంగా కనిపిస్తుంది. అలాగే సపోర్టివ్‌గా, సెల్ఫ్-అవేర్ నెస్‌గా, ప్రశ్నించే తత్వం కలిగిన వారిగా ఉంటారు.

సేవాభావం, దయార్థ హృదయం

సేవకుడి తరహా నాయకత్వ శైలిగల వ్యక్తులు దయార్థ హృదయం కలిగి ఉంటారు. తమ పరిధిలో పనిచేస్తున్న ఇతర వ్యక్తులను, సహచరులను చాలా విషయాల్లో అర్థం చేసుకుంటారు. ఉన్నత స్థాయి సంతృప్తిని సాధించడంలో సహాయపడటానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి గౌరవాన్ని ఇస్తుంది. అలాగే ప్రజలను మళ్లీ పనిలో నిమగ్నం చేయడంలో గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తారు. తమ టీమ్ గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. ఇతరులకు కూడా సహకరిస్తారు. కాకపోతే వీరు తరచూ ఎదుర్కొనే ఒక ప్రధాన సవాలు ఏంటంటే.. బర్న్‌ అవుట్. రిస్క్ ఏంటంటే వీరు ఇతరుల అవసరాలను తమ అవసరాలకంటే ఎక్కువగా పరిగణిస్తారు. తమకంటే ఎదుటి వారికి ప్రయారిటీ ఇస్తుంటారు.

నిరంకుశం, నిబంధన, ఆత్మ విశ్వాసం

నిరంకుశ శైలిని ఒక విధంగా అధికార-శైలిగా(authoritarian-style) పేర్కొనవచ్చు. ఈ లీడర్ షిప్‌స్టైల్ కలిగిన వ్యక్తులు తమ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌లో ఇండివిడ్యువల్‌గా ఉంటారు. మిలిటరీ కమాండెంట్‌ లాగానే తమ అధీనంలో ఉన్నవారు, తాము చెప్పినట్లు వినాలని ఆశిస్తారు. రూల్స్‌కు ఎక్కువ విలువనిస్తారు. ఇతరులకు ప్రేరణగా, ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం కారణంగా అతని పరిధిలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఒత్తిడిలేని పరిస్థితుల్లో ప్రయోజనం పొందుతారు. ఈ రకమైన నాయకత్వ శైలికి సంబంధించిన వారు నష్టాలకు సంబంధించిన విషయంలో సొంతంగా ఒత్తిడిని అనుభవిస్తారు. నిర్ణయాధికారం కలిగి ఉండటంతోపాటు బరువూ బాధ్యతను భరిస్తుంటారు.

పరివర్తన, ప్రేరణ, పారదర్శకత

ఉద్యోగులను మోటివేట్ చేయడంలో పరివర్తన నాయకత్వ శైలి కీలకంగా ఉంటుంది. కమ్యూనికేషన్‌లో పారదర్శకంగా ఉండటంలో ఇది ‘కోచ్-శైలి’ నాయకుడిని పోలి ఉంటుంది. అయినప్పటికీ వీరు ఉద్యోగులపై తక్కువ ఫోకస్ కలిగి ఉంటారు. ఆర్గనైజేషనల్ గోల్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మేధోపరమైన అవసరాలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. అనేక విషయాల్లో మంచి నాలెడ్జ్, సబ్జెక్ట్ కలిగి ఉంటారు. అయితే తమ వర్క్‌ప్లేస్‌లో ఈ నాయకులు టీమ్‌‌ను మేనేజ్ చేయడం, బాధ్యతల నిర్వహణ వంటి విషయాల్లో దృష్టి పెట్టడం కారణంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా పడుతుంటారు.

ప్రజాస్వామ్యం-భాగస్వామ్యం

ప్రజాస్వామ్య లేదా భాగస్వామ్య నాయకత్వ శైలిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఈ నాయకులు తమ బృందం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య కరమైన కార్యాలయ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్స్‌ను ప్రోత్సహిస్తారు. ఆలోచనలు, ఆచరణ హేతుబద్దమైనవిగా ఉంటాయి. ఇక ఈ నాయకత్వ శైలికి ప్రధాన సవాలు ఏంటంటే.. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదిగాను ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్‌కు, ప్రణాళికల రూపకల్పనకు, పరిష్కారాలకు సమయం పడుతుంది.

దూరదృష్టి, పారదర్శకత

విజనరీ లేదా పారదర్శకత్వం కలిగిన నాయకత్వ శైలి కలిగిన వారు తమ చుట్టూ ఉన్నవారిని ప్రమోట్ చేయడం ద్వారా మార్పును ప్రోత్సహిస్తారు. అలాగే తమ టీమ్‌తో, సహచరులతో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ పెంచుకోవచ్చు. పాపులర్ కల్చర్‌లో ఈ విధమైన దార్శనిక నాయకత్వ శైలి తరచుగా కనిపిస్తూ ఉంటుంది. దూరదృష్టి, ఆశావాదం, రిస్క్ తీసుకోగల నైపుణ్యం, ధైర్యం విజనరీ ఇలీడర్‌షిప్ నాయకత్వ ప్రత్యేక శైలిగా ఉంటాయి. అలాగే టీమ్‌లను ఏకం చేయడం, ప్రోత్సహించడం ద్వారా విజనరీ లీడర్లు తమ కంపెనీలు ఎదగడానికి సహాయం చేస్తారు. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్ద గోల్స్‌పై కేంద్రీకరిస్తూ ఇబ్బంది పడుతుంటారు కూడా. భవిష్యత్ ఆందోళనలకోసం వర్తమాన సమస్యలను త్యాగం చేస్తుంటారు.


Similar News