చెట్లకు విరబూసిన చంద్రుడు.. నాలుగు రోజులుగా వీక్షిస్తున్న లక్షలాది మంది (వీడియో)
మొక్కలకు పూలు పూయడం చూశాం.. చెట్లకు కాయలు కాయడం చూశాం. చంద్రుడు ఆకాశంలో ప్రకాశించడం చూశాం.
దిశ, వెబ్‌డెస్క్ : మొక్కలకు పూలు పూయడం చూశాం.. చెట్లకు కాయలు కాయడం చూశాం. చంద్రుడు ఆకాశంలో ప్రకాశించడం చూశాం. కానీ చెట్లకు చంద్రుడు పువ్వులా వికసించడం ఎప్పుడూ చూసిఉండం. కానీ క్రియేటివిటి ఉన్న ఓ ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ చెట్లకు పౌర్ణమి పూలను పూయించాడు. చూపరులు అబ్బురపడేలా చందమామ అందాలను బంధించాడు. మోడుబారిన చెట్ల మధ్యలో నుంచి వెండి వెలుగులు విరజిమ్ముతున్న చంద్రుడిని కనులకు ఇంపుగా చూపించాడు. అర్ధరాత్రి వేళ విరహవేదనతో కదులుతున్న వాడిలా చంద్రుడు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఓ వ్యక్తి తన X అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. లక్షలాది మంది వీక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.