కుక్కపిల్లకు జోల పాట.. కొత్త కాన్సెప్ట్ వర్కౌట్ అయ్యిందా.. చూడండి!
ఈ పప్పీకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్లున్నారు. The man sang a lullaby for his beagle puppy.
దిశ, వెబ్డెస్క్ః మనుషులు తమతో సమానంగా చూసుకునే జంతువు ఏదైనా ఉందంటే అది కుక్క అని నిర్మొహమాటంగా ఒప్పుకోక తప్పదు. అవి అంత త్వరగా కుటుంబంలో అందర్నీ ఆకర్షిస్తాయి కూడా. ఒక విదేశీ మహిళ అయితే తన కుక్కని పెళ్లి కూడా చేసుకుంది. ఇలా, కుక్కల్ని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా, సొంత బిడ్డలా చూసుకోవడం చాలా చోట్లు చూస్తుంటాము. అలాంటి ఓ కుటుంబమే తమ కుక్కను నిద్రపుచ్చడానికి లాలిపాట పాడుతుంది. కుక్కకు లాలిపాట ఎంత ప్రత్యేకమో, ఈ లాలిపాటను ఓ పురుషుడు పాడటం అంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతేనా, ఆ పాట కూడా సినిమా పాట.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను మిస్కెల్లీ.దిబీగల్ అనే ఖాతా నుండి పోస్ట్ చేయగా, ఇప్పటివరకు మిలియన్ కంటే ఎక్కువ వ్యూవ్స్ పొంది, వైరల్ అయ్యింది. వీడియోలో ఉన్న బీగల్ కుక్కపిల్ల పేరు మిస్ కెల్లీ. వయస్సు ఐదు నెలలు, ఈ పప్పీకి ఇన్స్టాగ్రామ్లో 3,400 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లున్నారు.