అక్కడి అమ్మాయిలు నాగు పాముల రక్తాన్ని జ్యూస్ లా తాగుతున్నారు.. దాని కోసమేనా?

అక్కడి అమ్మాయిలు నాగు పాముల రక్తాన్ని జ్యూస్ లా తాగుతున్నారు.

Update: 2024-03-27 04:02 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనకి ఆరోగ్యం బాగాలేకపోతే, వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్లడమో లేక ఇంట్లో ఉన్న మందులు వేసుకోవడమో చేస్తాము. కానీ ఆ దేశంలో అలా కాదు. శరీరంలో ఏదైనా సమస్య ఉంటే అక్కడి మహిళలు పాములు రక్తం తాగుతారంట. రక్తం తాగడం ఏంటని షాక్ అవుతున్నారా.. అయితే, ఆ స్టోరీ ఏంటో మీరు కూడా చదివి తెలుసుకోండి.

మనలో చాలా మంది పాము చూడగానే ఆమడ దూరం పారిపోతుంటారు. ఎందుకంటే అవి భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఒకటి. ఎంతటి బలవంతుడికైనా పామును చూడగానే చెమటలు పడతాయి. అయితే విషసర్పాల రక్తం తాగే అమ్మాయిలు కూడా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం. మనం టీ, కాఫీలు ఎలా తాగుతామో ఇండోనేషియా రాజధాని జకార్తాలో పాము రక్తం చాలా సులభంగా తాగేస్తారు. పాము రక్తం ఆరోగ్యానికి, అందానికి రెండింటికీ మంచిదని వారు నమ్ముతారు.

ఈ దేశంలో ఏ సందు చూసినా కాఫీ, టీ షాప్స్ ఉన్నట్టు పాము రక్తాన్ని విక్రయించే దుకాణాలు కనిపిస్తాయి. నిజానికి, జకార్తాలో నాగుపాముల విషపూరితమైన రక్తాన్ని త్రాగడం ఒక ట్రెండు లాగా మారింది. ఇక్కడి ప్రజలు ఎంజాయ్ చేసుకుంటూ పాము రక్తాన్ని తాగుతారు. జకార్తాలో పాము రక్తానికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా, ప్రతి రోజు వేలాది పాములు ఇక్కడ చంపబడుతున్నాయి. పాము రక్తం తాగిన తర్వాత 3 నుంచి 4 గంటల వరకు టీ, కాఫీలు తాగకూడదని చెబుతున్నారు. ఈ విధంగా, పాము రక్తం మానవ శరీరంలోకి ప్రవేశించన తర్వాత దాని పని అదే చేసుకుంటుందని చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News