అక్కడ ప్రతి పురుషుడూ ఇద్దరు మహిళల్ని పెళ్లిచేసుకోవాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే..
ఆధునిక ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధివైపు దూసుకెళ్తోంది. గతంతో పోలిస్తే మానవ సంబంధాల విషయంలోనూ ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు, సంప్రదాయాలు, ప్రజల ఆచార వ్యవహారాలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి.
దిశ, ఫీచర్స్ : ఆధునిక ప్రపంచం రోజురోజుకూ అభివృద్ధివైపు దూసుకెళ్తోంది. గతంతో పోలిస్తే మానవ సంబంధాల విషయంలోనూ ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు, సంప్రదాయాలు, ప్రజల ఆచార వ్యవహారాలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. అతి పురాతన పద్ధతులు, ఆశ్చర్యానికి గురిచేసే ఆచారాలు పాటించేవారు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉన్నారు. కొందరు ప్రత్యేక నియమ, నిబంధనలను పాటిస్తుంటారు. అలాంటి వారిలో ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా (Eritrea Polygamy) తెగ కూడా ఒక్కటి. ఈ తెగ ప్రజల వివాహాలు ఇతర ప్రపంచానికి భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్క పురుషుడు తప్పకుండా ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకొని తీరాల్సిందేనట.
స్త్రీలు కూడా కాదనడానికి లేదు..
చాలా వరకు పెళ్లిళ్లు సంప్రదాయాలు, ఆచారాలపైనే ఆధారపడి కొనసాగుతుంటాయి. అయితే ఆయా దేశాలు, ప్రాంతాలను బట్టి భిన్నంగా ఉంటాయి. ఒకప్పటి పురాతన సంప్రదాయంలో బహు భార్యత్వం ఉండేదని మనకు తెలిసిందే. కానీ ఈ సంప్రదాయం క్రమంగా కనుమరుగైపోయింది. ఇప్పుడు చాలా చోట్ల ఒక పురుషుడు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండే, చట్టం ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మొదటి భాగస్వామికి విడాకులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆఫ్రికాలో ఖండంలోని ఎరిత్రియా తెగలో మాత్రం అలా కాదు. వీరి వివాహ సంప్రదాయం చాలా డిఫరెంట్. ఇక్కడి ప్రతి పురుషుడు రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. కాదు కూడదు అంటే జైల్లో వేస్తారట. చట్టం, సంప్రదాయం ఉల్లంఘించిన కారణంగా జీవిత ఖైదు పడే చాన్స్ కూడా ఉంటుంది. ఇక మహిళలు కూడా దానికి అంగీకరించాల్సిందే. ప్రతి వివాహిత స్త్రీ తన భర్తను మరో మహిళతో పంచుకోవాలి. అడ్డు చెబితే ఇక్కడి చట్టం, సంప్రదాయం ఒప్పుకోదు.
ఎందుకలా?
ఎరిత్రియా తెగలోని ప్రతి పురుషుడు ఇద్దరు భార్యలను చేసుకోవాలన్న నిబంధన వెనుక ఓ రీజన్ ఉంది. ఈ తెగలో దశాబ్దాల కాలంగా పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటూ వస్తోందట. అందుకే స్త్రీ, పురుష నిష్పత్తిని సమానంగా ఉండేలా చేయడానికి ఇక్కడి పురుషులు ఇద్దరు మహిళలను చేసుకోవాలన్న ఆచారం కూడా కొనసాగుతూ వస్తోంది. పైగా దానిని చట్టంగా కూడా మార్చారట. అయితే ఈ ఎరిత్రియా వివాహ వ్యవస్థపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయినా ఇక్కడి ప్రజలు తమకు సంప్రదాయం, చట్టమే ముఖ్యమని అదే అనుసరిస్తూ వస్తున్నారు.