viral : గాలిపటంతో పాటు ఎగిరిపోయిన చిన్నారి.. ఒక్కసారిగా అందరూ షాక్!

పెద్ద బండ రాయిని ఎలుకలు నెట్టుకుపోవడం, ఓ పసికందును గద్ద తన్నుకుపోవడం వంటి వీడియోలు గతంలో నెట్టింట వైరల్ అవగా, చివరికి అవి నిజం కాదని, గ్రాఫిక్స్ అని తేలింది.

Update: 2024-06-18 07:56 GMT

దిశ, ఫీచర్స్ : పెద్ద బండ రాయిని ఎలుకలు నెట్టుకుపోవడం, ఓ పసికందును గద్ద తన్నుకుపోవడం వంటి వీడియోలు గతంలో నెట్టింట వైరల్ అవగా, చివరికి అవి నిజం కాదని, గ్రాఫిక్స్ అని తేలింది. కానీ ప్రజెంట్ గాలి పటం ఎగరేస్తున్న ఓ మూడేళ్ల చిన్నారి దానితోపాటు తను కూడా ఎగిరిపోయింది. అయితే ఇది మాత్రం గ్రాఫిక్స్ కాదు, రియలేనట. ప్రస్తుతం ఈ వీడియోను ఓ యూజర్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్‌గా తెగ వైరల్ అవుతోంది.

వైరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఒక మైదానంలో కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడికి వచ్చిన ఔత్సాహికులు సందడి చేస్తున్నారు. కొంతమంది ఓ ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఓ భారీ గాలి గాలిపటాన్ని ఎగరేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. దాని చివరి భాగాన్ని ఓ మూడేళ్ల పాప పట్టుకొని సరదాగా ఆడుకుంటున్నది. ఆ చిన్నారిని వారు గమనించలేదు. భారీ గాలిపటాన్ని ఎగరేసే ప్రయత్నం చేస్తుంగా అంతలోనే పెద్దగా ఈదురుగాలి రావడంతో ఒక్కసారిగా గాలిపటంతోపాటు ఆ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోయింది. ఇది చూసిన పేరెంట్స్ గట్టిగా కేకలు వేశారు. కాగా పాప కింద పడుతుందేమోనని అందరూ కంగారు పడ్డారు. కానీ అదృష్టం కొద్దీ ఆ చిన్నారికి ఏమీ కాలేదు. పాపను పైకి ఎగరేసుకుపోయిన గాలి క్రమంగా తగ్గుతూ.. ఈ చిన్నారిని కూడా క్రమంగా కిందకు దించేసింది. పాప గాల్లోకి ఎగరడం, ఒక్కసారిగా కింద పడిపోకుండా గాలి కూడా స్లో అవుతూ పాపను కిందకు దించడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు. 


Similar News