ఏకంగా పెళ్లి పందిట్లోనే అలా చేసిన వధూవరుడు.. షాక్లో బంధువులు
దిశ, వెబ్డెస్క్ : శ్రావణ మాసం మొదలైందంటే చాలు పెళ్లీలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసిన బాజభజంత్రిలతో ఊర్లన్నీ మారుమోగుతాయి. ఇక ఈ మధ్య పెళ్లీలలో హంగామా మాములుగా
దిశ, వెబ్డెస్క్ : శ్రావణ మాసం మొదలైందంటే చాలు పెళ్లీలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసిన బాజభజంత్రిలతో ఊర్లన్నీ మారుమోగుతాయి. ఇక ఈ మధ్య పెళ్లీలలో హంగామా మాములుగా ఉండటం లేదు. పెళ్లికి ముందే ఫొటో షూట్ చేసుకోవడం లాంటివి ఎక్కువవుతున్నవి. అంతే కాకుండా పెళ్లి వేడుకలు కూడా మాములుగా ఉండటం లేదు. అయితే ఒక పెళ్లిలో జరిగిన సంఘటన అందరినోట నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..!
ఓ గ్రామంలో పెళ్లి గ్రాండ్గా జరుగుతోంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఎంతో ఆనందగా పెళ్లిపందిరిపై ఉన్నారు. ఇద్దరూ సేమ్ కలర్ కాస్ట్యూమ్స్ ధరించి అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఇక పెళ్లీలో ఒక తంతు.. వధూవరులు స్వీట్ తినిపించుకోవడం. దీంతో ఇద్దరూ ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు. దీంతో ఒకరి మీద ఒకరు పడి, కొట్టుకున్నంత పని చేశారు.