EXOPLANET : భూమి అంతం.. ఇనుప వర్షం.. ఇంద్రధనస్సు.. మనుషులు మాడిపోయే ఉష్ణోగ్రతలు..

భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందని.. ఇక ప్రపంచం అంతం అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరో వైపు బ్లడ్ మూన్ మరోసారి కనిపిస్తే అదే చివరి రోజు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇదంతా జరుగుతుందో లేదో కానీ శాస్త్రవేత్తలు నరకాన్ని తలపించే గ్రహాన్ని కనిపెట్టారు. ఎక్సోప్లానెట్ WASP-76bని గుర్తించిన సైంటిస్టులు..

Update: 2024-09-11 09:10 GMT

దిశ, ఫీచర్స్ : భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందని.. ఇక ప్రపంచం అంతం అవుతుందని ప్రచారం జరుగుతుంది. మరో వైపు బ్లడ్ మూన్ మరోసారి కనిపిస్తే అదే చివరి రోజు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇదంతా జరుగుతుందో లేదో కానీ శాస్త్రవేత్తలు నరకాన్ని తలపించే గ్రహాన్ని కనిపెట్టారు. ఎక్సోప్లానెట్ WASP-76bని గుర్తించిన సైంటిస్టులు.. ఇది విచిత్రమైన పర్యావరణ పరిస్థితులను కలిగి ఉందని చెప్తున్నారు. 2,000 డిగ్రీల కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రత కలిగిన అత్యంత తీవ్రమైన గ్రహాలలో ఇది ఒకటని వివరించారు.

హోస్ట్ స్టార్ కు చాలా దగ్గరగా ఉన్నందున ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు గుర్తించారు. దీని కారణంగా తీవ్రమైన గాలులు గ్రహాన్ని చుట్టుముట్టాయన్నారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వాతావరణంలో దిగువ నుంచి పై పొరల వరకు అధిక పరిమాణంలో ఇనుము అణువులను కలిగి ఉండడం. ఇక పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. తీవ్రమైన వేడి ఇనుమును ఆవిరి చేస్తుంది. ఇది ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ద్రవంగా ఘనీభవిస్తుంది. ఇనుప వర్షం వలె ఉపరితలంపై తిరిగి వస్తుంది. WASP-76b వాతావరణంలో తీవ్రమైన ఇనుప గాలులను గమనించినట్లు తెలిపారు. కాగా ఖగోళ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను ఆస్ట్రానమీ & ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రకటించారు. ఇక భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ ప్లానెట్... 1.8 రోజులో కక్ష్యను పూర్తి చేయగలదు.

Tags:    

Similar News