కుక్క కాలు ఎత్తి మూత్రం పోయడం వెనుక అసలు కారణం అదేనట..

కుక్క కాలు ఎత్తి మూత్రం పోయడం ఎప్పుడైనా గమనించారా..? అన్ని జంతువులకు భిన్నంగా కుక్క మాత్రమే ఎందుకు అలా చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా..? ఆలోచించే ఉంటారు.

Update: 2023-06-10 08:23 GMT

దిశ, వెబ్ డెస్క్: కుక్క కాలు ఎత్తి మూత్రం పోయడం ఎప్పుడైనా గమనించారా..? అన్ని జంతువులకు భిన్నంగా కుక్క మాత్రమే ఎందుకు అలా చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా..? ఆలోచించే ఉంటారు. కానీ సమాధానం దొరకలేదా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కను అత్యంత విశ్వాసం క‌లిగిన జంతువుగా ప‌రిగ‌ణిస్తాం. మాన‌వునితో తొలిసారి స్నేహం చేసిన జంతువు కుక్కనే. అందుకే పలు సందర్భాల్లో ఎవరికైనా గతంలో మనం ఉపకారం చేసి ఉంటే వారే మనని మోసం చేసినప్పుడు ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేదు’ అని అంటుంటారు. అయితే అలాంటి కుక్క క‌రెంట్ స్తంభం మీద, వాహనాల చ‌క్రాల మీద‌, ఏదైనా పాతిన క‌ర్ర ఉంటే దాని మీద కాలు ఎత్తి మూత్రం పోస్తుంటుంది. దాని వెనుక మాత్రం ఓ బ‌ల‌మైన కార‌ణం ఉందట.

అది ఏంటంటే క‌రెంట్ స్తంభాలు, తుప్పలు, బండి చ‌క్రాల మీద‌, రాయి వంటి వాటి మీద కుక్క కాలు లేపి మూత్రం కొద్ది మోతాదులో వ‌దిలి ముందుకెళ్తూ ఉంటాయి. అక్కడ కొంచెం పోసి మ‌రికొంత దూరం వెళ్లిన త‌రువాత మ‌ళ్లీ కొంచెం వ‌దులుతాయి. కుక్కలు ఆహార అన్వేష‌ణ కోసం గుంపులు గుంపులుగా వెళ్లుతుంటాయి. పెద్ద గుంపు, చిన్న గుంపుగా త‌రువాత ఒక్కొక్కటి విడిపోతాయి. కుక్కల‌కు వాస‌న శ‌క్తితో పాటు వినికిడి శ‌క్తి కూడా ఎక్కువ ఉండ‌డంతో చాలా ఈజీగా వాటికి ఆహారం దొరికిపోతుంటుంది. ఈ విధంగా ఆహారం వేట‌లో కొంత దూరం వెళ్తుంటాయి. అవి మూత్రం పోయ‌డం అనేది ఒక సిగ్నల్‌. త‌మ గుంపును క‌లుసుకోవ‌డానికి మూత్రం వ‌దిలి వెళ్లుతూ ఉంటాయి. ఇలా మూత్రం వ‌ద‌ల‌డంతో వేరే కుక్కల‌కు ఒక క్లారిటీ వ‌స్తుంది. ఒక్కో కుక్క మూత్రం వాస‌న ఒక్కో విధంగా ఉంటుంది. అది కుక్క ప‌సిగ‌ట్టి ఆ మార్గంలో ఎన్ని కుక్కలు వెళ్లాయో తెలుసుకుంటుంటాయి. ఆ మూత్రం వాస‌న ద్వారా ఇత‌ర కుక్కల‌కు మార్గం సులభంగా తెలుస్తందట.

ఇవి కూడా చదవండి:

ఏడుపు రాని వారి కోసం కాలేజ్ .. ఎలా ఏడవాలో శిక్షణ!  

Tags:    

Similar News