బొగ్గుతో దంతాల మెరుపు.. నిజంగా సాధ్యమేనా?

పేలవమైన నోటి పరిశుభ్రత, కాఫీ, టీ, రెడ్ వైన్, సోడా వంటి పానీయాలు, కొన్ని ఆహారాలు, ధూమపానం చేయడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ దంతాల ఎనామెల్ సన్నగా మారడం వల్ల పసుపు రంగు డెంటిన్ కనిపిస్తుంది.

Update: 2024-10-11 14:42 GMT

దిశ, ఫీచర్స్ : పేలవమైన నోటి పరిశుభ్రత, కాఫీ, టీ, రెడ్ వైన్, సోడా వంటి పానీయాలు, కొన్ని ఆహారాలు, ధూమపానం చేయడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ దంతాల ఎనామెల్ సన్నగా మారడం వల్ల పసుపు రంగు డెంటిన్ కనిపిస్తుంది. కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కూడా టీత్ రంగు మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, దంతాలు తెల్లగా మెరిసిపోయేందుకు బొగ్గు పొడి ఉపయోగంచమని సూచిస్తున్న నిపుణులు.. నోటి పరిశుభ్రతకు ఎలా హెల్ప్ చేస్తుందో చెప్తున్నారు.

బొగ్గు అనేది చెక్క, కొబ్బరి చిప్పలు వంటి సహజ వనరులను అధిక ఉష్ణోగ్రతల ద్వారా మండిచడం ద్వారా వచ్చిన నల్లని పొడి. కాగా ఈ యాక్టివేషన్ ప్రక్రియ దాని శోషక లక్షణాలను పెంచుతుంది. టాక్సిన్స్, మలినాలను సమర్థవంతంగా బంధించడానికి అనుమతిస్తుంది. యాక్టివేటెడ్ చార్‌కోల్ గ్రిల్లింగ్ కోసం ఉపయోగించే బొగ్గుకు భిన్నంగా ఉంటుంది. స్టాట్‌పెర్ల్స్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో కనుగొనబడినట్లుగా.. ఈ ప్రత్యేక లక్షణం ఉత్తేజిత బొగ్గును రసాయనాలు, టాక్సిన్‌లను ట్రాప్ చేస్తుంది. అందుకే దీన్ని వివిధ ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులలో ప్రముఖ పదార్థంగా వాడుతున్నారు.

తెల్లగా మార్చడానికి ఎలా సహాయపడుతుంది?

యాక్టివేట్ చేయబడిన బొగ్గు డిటాక్సిఫికేషన్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో "విషఘ్న" అని పిలుస్తారు. అంటే విషాన్ని తొలగించడం. యాక్టివేటెడ్ చార్‌కోల్ నోటిలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో, హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుందని.. మొత్తం నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు నిపుణులు. అంతేకాదు ఈ బొగ్గు మరకలను తొలగించడం ద్వారా దంతాల రూపాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అంతర్గత రంగును మార్చడం కంటే మరకలను శోషించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ వెనుక ఉన్న మెకానిజం యాక్టివేటెడ్ బొగ్గు పోరస్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఆహారం, పానీయాల ద్వారా ఏర్పడిన మరకలను బంధిస్తుంది. ఎనామెల్ నుంచి సమర్థవంతంగా బయటపడేస్తుంది.

Tags:    

Similar News