self-diagnosing : స్వీయ మానసిక రోగ నిర్ధారణ.. సోషల్ మీడియా ప్రభావంతో ప్రమాదకరణ ధోరణి
ఈరోజుల్లో సోషల్ మీడియా మోస్ట్ పవర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇందులో చాలా విషయాలు ఉంటాయి. అలాగని ఇక్కడ ఉన్నవన్నీ మంచి విషయాలే అని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు.
దిశ, ఫీచర్స్ : ఈరోజుల్లో సోషల్ మీడియా మోస్ట్ పవర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇందులో చాలా విషయాలు ఉంటాయి. అలాగని ఇక్కడ ఉన్నవన్నీ మంచి విషయాలే అని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అట్లనే మొత్తానికి ఉపయోగం లేని సమాచారమే ఉంటుందని కొట్టిపారేయాల్సిన అవసరం కూడా లేదు. దేనికైనా విషయ పరిజ్ఞానం, విచక్షణా జ్ఞానం ముఖ్యం. కానీ ఇటీవల అడాలోసెంట్స్‌లో సోషల్ మీడియా కారణంగా పెరిగిపోతున్న స్వీయ నిర్ధారణ ధోరణితో ఈ క్లారిటీ మిస్ అవుతోంది. ఫలితంగా సెల్ఫ్ యగాగ్నోసిస్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
కన్ఫామ్ అయినట్టేనా?
మానసిక ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో యుక్త వయస్కుల స్వీయ-నిర్ధారణ ప్రమాదకరమైన ధోరణిగా మారుతోందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ‘‘మీరు తరచూ విసుగు చెందుతున్నారా, వస్తువులను మర్చిపోతున్నారా? పరధ్యానంలో ఉంటున్నారా? ఇవి ఎడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్) లక్షణాలు’’ అని సోషల్ మీడియాలో చదివిన అడాలోసెంట్స్ వాటిని నమ్మేస్తున్నారు. ఈ లక్షణాలు తమలో కనిపిస్తే ఎడీహెచ్‌డీ బారినపడినట్లు ఫిక్స్ అయిపోతున్నారు. అలాగే తమ కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరిలో కనిపించినా కచ్చితంగా అదే అని కన్ఫామ్‌గా చెప్పేస్తుంటారు.
ప్రమాదకర ధోరణి
ఒక వ్యక్తి ఏడీహెచ్‌డీకి సంబంధించిన సింప్టమ్స్ లాంటివి కలిగి ఉండవచ్చు. అయినంత మాత్రానా దానిని సెల్ఫ్ డయాగ్నోస్ చేయడానికి జస్ట్ మూడు సెకన్లు సరిపోతుందా? సమాధానం విషయానికి వస్తే ‘లేదు’ అనే చెప్పాలి. కానీ నేడు అడాలోసెంట్స్ ‘అవును’ అనే ధోరణి పెరిగిపోతోంది. యాంగ్జైటీస్, డిప్రెషన్, మెంటల్ క్రైసిస్, OCD (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) వంటి లక్షణాలను సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా విద్యార్థులు, యువతీ యువకులు నిర్ధారిస్తున్నారు. ఇలా మానసిక ఆరోగ్య సమస్యలను స్వీయ నిర్ధారణ చేసే ట్రెండ్ ప్రమాదకరం.
లక్షణాలన్నీ రుగ్మతలేనా?
మానసిక ఆరోగ్య సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా గొప్పగా సహాయపడుతోంది. కానీ ఇక్కడ తప్పుడు సమాచారం లేదన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ఇటువంటి సందర్భాల్లో ఆ సమాచారం ఆధారంగా స్వీయ నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు. అందుకే ఈ ధోరణి ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సాధారణ మూడ్ స్వింగ్ వల్ల కూడా కొన్నిసార్లు ఏడీహెచ్‌డీగానో, డిప్రెషన్ వంటి లక్షణాలు ఉన్నట్లు అనిపంచవచ్చు. హార్మోన్లలో మార్పుల వల్ల కూడా కొన్ని మానసిక పరిస్థితులు సంభవిస్తుంటాయి. అలాంటప్పుడు ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా ఆధారిత మానసిక లక్షణాల సమాచారాన్ని బేస్ చేసుకొని సెల్ఫ్ డయాగ్నోస్ చేయడం కరెక్ట్ కాదు.
నివారణ ఎలా?
సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆకలిని, ఆసక్తిని కోల్పోవడం, మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా భావించబడతాయి. అలాగే ఏడీహెచ్‌డీ, యాంగ్జైటీ, ఓసీడీ వంటి తీవ్రమైన మానసిక వ్యాధుల లక్షణాలను పోలిన ప్రమాదకరం కాని టెంపరరీ బిహేవియర్ కూడా ఉండవచ్చు. ఇటువంటప్పుడు స్వీయ నిర్ధారణ దెబ్బతీస్తుంది. అందుకే సైంటిఫిక్ సమాచారం, నిపుణులను సంప్రదించనిదే సోషల్ మీడియా సమాచారం ఆధారంగా మాత్రమే మానసిక రుగ్మతల విషయంలో ఒక నిర్ధారణకు రావడం, సొంతంగా మెడికేషన్స్ వాడటం తగదు. పేరెంట్స్ తమ పిల్లలు ఇటువంటి ప్రమాదకర ధోరణులకు గురికాకుండా చూసుకోవాలి.