Tortigrade : ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగల ఒకే ఒక్క జీవి.. ఏదంటే..

ప్రకృతి వైపరీత్యాలో, ప్రళయాలో వస్తే మానవులకు ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇతర జీవరాశులు కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది.

Update: 2024-08-04 10:12 GMT

దిశ, ఫీచర్స్ : ప్రకృతి వైపరీత్యాలో, ప్రళయాలో వస్తే మానవులకు ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇతర జీవరాశులు కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ భూమిపై ఒకే ఒక్క జీవికి మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రాణహాని ఉండదు అంటున్నారు నిపుణులు. చివరికి మానజాతి అంతరించిపోయినా.. అది మాత్రం జీవించే ఉంటుందని, నీరు, ఆహారం లేకుండా 30 ఏండ్లపాటు ఈజీగా బతికేస్తుందని చెప్తున్నారు. ఆ జీవి మరేదో కాదు టార్డిగ్రేడ్. 0.5 మిల్లీ మీటర్లు మాత్రమే ఉంటుంది. తెలుగులో నీటి ఎలుగు బంటి అని పిలుస్తారు.

ఉష్ణోగ్రత్తల్లో  హెచ్చు తగ్గులు సంభవిస్తేనే మానవులు తట్టుకోలేరు. సాధారణ ఉష్షోగ్రత 50 డిగ్రీలు  దాటిందంటే తల్లడిల్లిపోతారు. ఒకవేళ 150 డిగ్రీల ఉష్ణోగ్రత అంటూ నమోదైతే అసలు మనుషులు అనేవారే ఈ భూమిపై ఉండరు. అలాగే మైనస్ 457 డిగ్రీల చలి వాతావరణం ఉన్నా కూడా చాలా జీవులు ప్రాణాలు కోల్పోతాయి. కానీ నీటి ఎలుగు బంటి మాత్రం ఇలాంటివి ఎన్ని జరిగినా బతికే ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు గుర్తించారు. గడ్డ కట్టిన మంచులోనైనా , మరుగుతున్న నీటిలో ఉడకబెట్టినా అది రెండు వందల ఏండ్లు జీవించే ఉంటుందట. ఒకవేళ ఇది నిజంగా చనిపోవాలంటే సూర్యుడు పూర్తిగా నాశనమై, భూమిపై మొత్తం చీకటి ఆవహించినప్పుడే సాధ్యం కావచ్చు తప్ప, అప్పటిదాకా అది బతికే ఉంటుందని శాస్త్రవేత్తలు  చెప్తున్నారు.

Tags:    

Similar News