Butter Milk: మజ్జిగలో వీటిని కలిపి తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు

ఒకసారి శరీరంలో ఈ సమస్య మొదలైతే అది పైల్స్‌కు కారణం అవుతుంది

Update: 2024-10-10 09:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. దీని వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి . ఒకసారి శరీరంలో ఈ సమస్య మొదలైతే అది పైల్స్‌కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి మీ ఆహారంలో మజ్జిగను చేర్చుకోవాలి.

జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకోవడం వలన కడుపు నొప్పి వస్తుంది. ఆహారంలో సరిపడినంత ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. దీనితో బాధపడేవారు రోజూ మజ్జిగను తీసుకోవాలి. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే మజ్జిగలో ఏవేమి తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

జీలకర్ర, మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో ఒక టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరంమసాలా పొడిని కలుపుకుని తీసుకోవాలి. దీనిని ఉదయం, మధ్యాహ్నం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులో బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అలాగే పొట్టను కూడా చల్లబరుస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News