కండరాలు పెంచాలని స్టెరాయిడ్స్ .. గుండెపోటుకు కారణం కావచ్చు
ఇటీవల యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. కొందరైతే కండరాలు తిరిగిన శరీరం కోసం వ్యాయామాలకు అధిక సమయం కేటాయిస్తు్న్నారు. జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.
దిశ, ఫీచర్స్ : ఇటీవల యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది. కొందరైతే కండరాలు తిరిగిన శరీరం కోసం వ్యాయామాలకు అధిక సమయం కేటాయిస్తు్న్నారు. జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. కాగా సిక్స్‌ప్యాక్, బిగ్ మజిల్స్ వంటి బాడీ బిల్డింగ్ ప్రక్రియలు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నట్లు బర్మింగ్ హోమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అథ్లెట్లు, ఎంటర్‌టైనర్లు, బాడీ బిల్డర్లు దశాబ్దాల కాలంగా తమ బాడీ మాస్ ఇండెక్స్ లెవల్స్ పెంచడానికి అనబాలిక్ స్టెరాయిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే బాగా తినడం, తరచుగా వర్క్ చేయడం వంటి యాక్టివిటీస్‌వల్ల పెద్ద పెద్ద కండరాలు పెరిగే అవకాశం ఉండదు. అందుకే శరీరంలోని కణజాల నిర్మాణంలో బలవంతంగా మార్పులు రావడానికి కారణం అయ్యే అనబాలిక్ (టెస్టోస్టెరాన్) స్టెరాయిడ్స్‌ను ఇంజక్షన్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు. కానీ అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి.
గుండెపై ఎఫెప్ట్
అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. బాధితుల్లో తప్పకుండా గుండె జబ్బులు తలెత్తే చాన్స్ ఉందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. టెస్టోస్టెరాన్ తీసుకోవడం వల్ల ఇప్పటికే ప్రిడిపోజిషన్‌లో ఉన్న వ్యక్తులలో కర్ణిక దడ లేదా క్రమరహిత హృదయ స్పందన ప్రమాదాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జర్మనీకి చెందిన మరికొందరు నిపుణులతో కలిసి బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నేతృత్వంలోని వైద్యులు, పరిశోధకుల ఇంటర్ డిసిప్లినరీ కన్సార్టియం ఈ పరిశోధనకు నాయకత్వం వహించింది. అనబాలిక్ స్టెరాయిడ్స్ లేదా టెస్టో స్టెరాన్ ఇంజెక్షన్లవల్ల హార్ట్ టాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి కండరాలు పెంచుకోవడానికి వాటిని తీసుకోవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.