ఇలాంటి లక్షణాలుంటే కండ్లకలక అని అర్థం.. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

మారుతున్న వాతావరణం కారణంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.

Update: 2023-07-31 15:20 GMT

దిశ, ఫీచర్స్: మారుతున్న వాతావరణం కారణంగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. మరి దీన్ని ముందు ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

* కండ్లకలక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. అందుకే అంతటా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ చేతులు కడగడం, కళ్లు ముట్టుకోకపోవడం, చేతి రుమాళ్ళు ఇతరులతో పంచుకోకపోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరోనా టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలే పాటించాలి.

* పెద్దవాళ్లలో కూడా ఈ సమస్య మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో 2500కు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్‌లో 400 మంది విద్యార్థులకు ఈ కండ్లకలక వ్యాధి సోకింది.

కండ్లకలక లక్షణాలు :

* కండ్లకలక కేసులు ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. కళ్లు ఎరుపెక్కడం, దురద, కనురెప్పలు ఉబ్బినట్టు అనిపించడం దీని లక్షణాలు.

* బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే గనుక కళ్ల నుంచి నలక ఎక్కువగా రావొచ్చు. అయితే కంట్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల వీటి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్య తగ్గడానికి వారం నుంచి రెండు వారాల సమయం పట్టొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. కళ్లను ముట్టుకోకపోవడం:

నార్మల్‌గా పిల్లలు తరచూ కళ్లు ముట్టుకోవటం చేస్తుంటారు. అలా కళ్లని తరచూ ముట్టుకోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫోన్ చూస్తూ కళ్లు నలుస్తుంటారు. అందుకే వారిని ఫోన్‌కి దూరంగా ఉంచాలి. బయటకు వెళ్లినా కళ్లజోడు పెట్టి పంపించండి.

2. చేతులు శుభ్రం చేసుకోవడం:

పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కునేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. దీనివల్ల క్రిములు దరిచేరవు. లేదంటే చేతులు కంట్లో పెట్టుకున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. ఏదైనా వస్తువు పట్టుకున్న కూడా వెంటనే చేతులు కడుక్కోమని చెప్పండి. పిల్లలు మాత్రమే కాదు పెద్దవారు కూడా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.

3. వ్యక్తిగత శుభ్రత:

కండ్లకలక రాకుండా జాగ్రత్తలు తీసుకునే భాగంలో కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు వాడితే సరిపోదు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లి రాగానే వాటర్‌తో కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి.

4. టిష్యూలు వాడకం:

తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బారిన పడకుండా టిష్యూ అడ్డుపెట్టుకోవడం అలవాటు చేయాలి. దీనివల్ల గాలి ద్వారా ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉంటాయి. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు బస్, ఆటో, మెట్రో, ఇలా పబ్లిక్ వెహికిల్స్‌లో జర్నీ చేస్తున్నప్పుడు హ్యాండిల్స్ పట్టుకున్నప్పుడు టిష్యూతో పట్టుకుంటే  మంచిది. ఎందుకంటే అందరు ప్రయాణికులు హ్యాండిల్స్ పడుకుని ఉంటారు. క్రిములు బ్యాక్టీరియా అలాంటి ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకే టిష్యూ వాడటం బెటర్.

5. వైద్య సలహా:

ఐ ఫ్లూ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరగకుండా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఇంట్లోవారికి, ముఖ్యంగా చిన్న పిల్లలకు దూరంగా ఉండాలని, తగ్గేంత వరకు ఎవరిని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరి దగ్గరకు వెళ్లకూడదని నిపుణులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి కండ్లకలక రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నిపుణుల సూచనలివే!

Tags:    

Similar News