Best Tourist Country : ఎత్తైన కొండలు.. అందమైన గడ్డి మైదానాలు.. పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న దేశం ఇదే!

ఈ భూమిపై చూడగానే ఆకట్టుకునే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు చూసినా తనివి తీరని అద్భుత దృశ్యాలతో ఆకట్టుకునే ప్రాంతాలను, దేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.

Update: 2024-09-11 07:01 GMT

దిశ, ఫీచర్స్: ఈ భూమిపై చూడగానే ఆకట్టుకునే ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపు చూసినా తనివి తీరని అద్భుత దృశ్యాలతో ఆకట్టుకునే ప్రాంతాలను, దేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వాటిలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అందమైన ప్రాంతంగా స్విడ్జర్లాండ్ ఆకట్టుకుంటుందోని నిపుణులు చెప్తున్నారు. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. వాతావరణం, పర్యావరణం పరంగా టూరిస్టులను ఆకట్టుకునే బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024 జాబితా ప్రకారం స్విడ్జర్లాండ్ మొదటిస్థానంలో నిలిచింది. వరుసగా మూడవసారి ఈ రికార్డును సొంతం చేసుకున్న ఆ దేశాన్ని పలువురు భూలోక స్వర్గంగా అభివర్ణిస్తున్నారు.

వాస్తవానికి స్విడ్జర్లాండ్ వాతావరణ, పర్యావరణ కాలుష్యానికి చాలా దూరంగా ఉంది. ఎత్తైన పర్వతాలతో, అలరించే ప్రకృతి అందాలతో ఆకట్టుకోవడంలో ఇది ముందున్నది. కొండలను కూడా గడ్డి మైదానాలుగా, పచ్చటి చెట్లతో కూడిన ప్రకృతి ఆవాసాలుగా మార్చడంలో ఆ దేశం సక్సెస్ అయిందని చెప్తుంటారు. ఇక అక్కడి జలపాతాలు ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతుంటాయి. వాటిలో చెత్తా చెదారం, మురుగు నీరు చేరే అవకాశం లేకుండా పకడబ్బందీ చర్యలు తీసుకుంటోందట స్విస్ ప్రభుత్వం.

పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండం కారణంగానే స్విడ్జర్లాండ్ ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా, ప్రజల లైఫ్ క్వాలి క్వాలిటీని కూడా ఇది పెంచుతోంది. సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపద, సాహసం, మెరుగైన జీవన ప్రమాణాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకున్నా కూడా స్విడ్జర్లాండ్ ముందంజలో ఉందంటున్నారు నిపుణులు. ఇక అందమైన ప్రకృతి, పర్యావరణం, వాతావరణాల పరంగా ప్రపంచ ప్రజలను ఆకట్టుకునే దేశాల జాబితాలో స్విడ్జర్లాండ్ తర్వాత రెండవ స్థానంలో జపాన్ ఉండగా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వరుసగా ఆ తర్వాతి స్థానంలో నిలిచాయని, ఇండియా 33వ స్థానంలో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 


Similar News