Sweating problems: హైపర్ హైడ్రోసిస్.. ఆ సమయంలో అధిక చెమటకు కారణం ఇదేనా?

Sweating problems: హైపర్ హైడ్రోసిస్.. ఆ సమయంలో అధిక చెమటలకు కారణం ఇదేనా?

Update: 2024-09-30 12:58 GMT

దిశ, ఫీచర్స్: హైపర్ హైడ్రోసిస్ గురించి విన్నారా..? విపరీతమైన చెమటలు పట్టే శారీరక స్వభావం కలిగి ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అదేం ప్రాణాంతకం కాదు కానీ ఇబ్బందిగా అనిపిస్తుంది. బయటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెమటలు పట్టినా గాలివల్ల అవి ఆరిపోతుంటాయి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అలా జరిగితే స్నానం చేసేస్తారు. కానీ ఆఫీసుల్లోనో, మీటింగుల్లోనో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో అలా జరిగితే ఏం చేస్తారు?.. ఇక భరించాల్సిందే. కానీ చాలా కాలం అదే కొనసాగితే దుర్వాసన వెదజల్లే పరిస్థితి వస్తుంది. అధిక చెమటలకు దుర్గంధం తోడైతే ‘బ్రొమిడోసిస్’ అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందని, ఇది ‘హైపర్ హైడ్రోసిస్’ వ్యాధికి దారితీస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెప్తున్నారు.

చెమటకు బ్యాక్టీరియా తోడై..

చెమటలోని లవణీయతకు బ్యాక్టీరియా తోడైతే దుర్గంధం పెరుగుతుంది. ఇదే హైపర్ హైడ్రోసిస్ వ్యాధికి దారితీస్తుంది. అయితే కొందరు చిన్న సమస్యే అనుకని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎక్కువసార్లు స్నానం చేయడంవల్ల, అనుకూలంగా ఉండే దుస్తులు ధరించడంవల్ల ప్రాబ్లం క్లియర్ అవుతుందని మరికొందరు భావిస్తుంటారు. కానీ ఇది సరైన పరిష్కారం కాదని, వ్యాధికి గల మూలకారణాలను నివారించడమే మంచిదని చర్మవ్యాధి నిపుణులు చెప్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రిస్క్

విపరీతమైన చెమటలతో వచ్చే దుర్గంధాన్ని పోగొట్టుకోవడానికి మెడికేటెడ్ సోప్స్, లోషన్స్, పౌండర్లు, సెంట్లు వాడుతుంటారు కొందరు. ఇవి కూడా పర్మినెంట్ సొల్యూషన్ కాదు. పైగా హైపర్ హైడ్రోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఎర్రటి లేదా నీలం రంగు చెమటతో కూడిన ‘క్రోమిడ్రోసిస్’ అనే వ్యాధికి దారితీయవచ్చు. కొన్నిసార్లు అసలుకే చెమలు పట్టకపోవడం అనే ‘ఎన్ హైడ్రోసిస్’కు కారణం కావచ్చు. ఇది చెమటలు పట్టడంవల్ల కలిగే ప్రయోజనాలను అడ్డుకుంటుంది. అందుకే దుర్వాసనతో కూడిన అధిక చెమటలు పట్టే పరిస్థితిని ఎదుర్కొనే వారు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇక చెమటలు పట్టినప్పుడు బయటకు రాకపోయినా, అధిక చెమటలు పట్టినా, అసలుకే పట్టకపోయినా కూడా ప్రమాదమే. ఒక సాధారణ స్థాయిలో చెమటలు పట్టడమే మానవ ఆరోగ్యానికి మంచిది.

‘మిలయేరియా’కు దారితీస్తుంది

చెమటలు పట్టి శరీరం నుంచి బయటకు వెళ్లడానికి అవసరం అయిన స్వేద గ్రంధులు లేకపోతే ‘మిలియేరియా’ (Miliaria) అనే వ్యాధి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో శరీరంపై చెమట గుల్లలుగా మారుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే లేదా వేసవిలో చెమట పొక్కులు రావడం, మంటగా అనిపించడం జరగవచ్చు. చేతుల పైభాగంలో, ఛాతిమీద పొట్టమీద పొక్కులకు దారితీయవచ్చు. కాస్త తేమ లేదా తడి ఉండే అవకాశమున్న శరీర భాగాల్లో ముఖ్యంగా గజ్జలు, పాదాల వ్రేళ్ల మధ్య, చంకల్లో అధిక చెమటవల్ల ఫంగస్ డెవలప్ అవుతుంది. ఈ క్రమంలో పరిశుభ్రత పాటించకపోతే ‘ఆస్పర్జిల్లస్’ అనే ఫంగస్ వ్యాపించి చెవులు, చర్మం, ఊపిరితిత్తుల్లో సమస్యలకు దారితీయవచ్చు.

పరిశుభ్రత - చికిత్స

అధిక చెమటలు, ముఖ్యంగా దుర్గంధంతో కూడిన చెమటలు వంటి సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కువసార్లు స్నానం చేయడం, పరిశుభ్రత పాటించడం మంచిదే. కానీ ఇంట్లో ఉంటే అలా చేయవచ్చు ఆఫీసుల్లోనో, బయటి పరిస్థితుల్లోనే ఉంటే ఏం చేస్తారు? కాబట్టి ఇందుకు శాశ్వత పరిష్కారం లభించాలంటే వైద్య నిపుణులను సంప్రదించి ‘హైపర్ హైడ్రోసిస్’కు చికిత్స తీసుకోవడం మంచిదని చర్మ వైద్య నిపుణులు సూచిస్తు్న్నారు. స్వేద గ్రంధుల్లో దుర్వాసనను నివారించే ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. 


Similar News