Sweating: ఈ చిట్కాలను పాటించండి.. చెమటకాయలను తగ్గించుకోండి!
ఎండాకాలంలో చాలా మందికి చెమట ఎక్కువగా పోస్తుంది.
దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలంలో చాలా మందికి చెమట ఎక్కువగా పోస్తుంది. దీని వల్ల చర్మంపై చిన్న చిన్న పొక్కులు వస్తుంటాయి. వీటినే చెమట పొక్కులు, చెమట కాయలు అంటారు. వీటిని తగ్గించుకోవడానికి మనం అనేక రకాల పౌడర్స్ వాడుతుంటాము అయినా కూడా ప్రయోజనం ఉండదు. సహజంగానే ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
1. చల్లని నీటితో స్నానం చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి తగ్గిపోతాయి. కాబట్టి చల్లని నీటితో స్నానం చేయండి.
2. దద్దుర్లు తొందరగా తగ్గాలంటే చల్లని వాతావరణంలో ఉండాలి.
3. ఎండలో కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల దద్దుర్లు సమస్యలు తొందరగా తగ్గుతాయి.
4. చల్లని నీటిలో ముంచిన బట్టలను చెమటకాయల మీద రుద్దడం వల్ల చికాకు తగ్గుతుంది.
Also Read..
Food Poisoning: వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ఎందుకవుతుందో తెలుసా?