నో ఇంట్రెస్ట్.. పెళ్లైన ఏడాదికే శృంగారం పట్ల తగ్గుతున్న ఆసక్తి.. మహిళల్లోనే ఎక్కువ !

మానవ జీవిత అవసరాల్లో శృంగారం ఒకటి. పెళ్లయ్యాక దంపతులెవరూ లైంగిక ఆనందాన్ని ఆస్వాదించకుండా ఉండలేరు. ఒకవేళ దీర్ఘకాలంపాటు అలా ఉంటున్నారంటే ఏవైనా వ్యక్తిగత, ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయని చెప్తుంటారు.

Update: 2024-04-02 08:01 GMT

దిశ, ఫీచర్స్ : మానవ జీవిత అవసరాల్లో శృంగారం ఒకటి. పెళ్లయ్యాక దంపతులెవరూ లైంగిక ఆనందాన్ని ఆస్వాదించకుండా ఉండలేరు. ఒకవేళ దీర్ఘకాలంపాటు అలా ఉంటున్నారంటే ఏవైనా వ్యక్తిగత, ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయని చెప్తుంటారు. అయితే అలాంటివేమీ లేకుండానే మారుతున్న జీవన శైలి కారణంగా శృంగారంపట్ల ఆసక్తి తగ్గుతోందని ఆన్‌లైన్ బేసిస్‌గా ఒక డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం చాలామందిలో స్త్రీ, పురుషుల్లో పెళ్లైన ఏడాదికే సెక్స్ కోరికలు గతంకంటే తగ్గుతుండగా మహిళల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది.

ప్రతి ఐదుగురు భారతీయ మహిళల్లో నలుగురు పెళ్లైన ఏడాది తర్వాత పురుషులతో పోల్చినప్పుడు సెక్స్‌పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో భర్తల ద్వారా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయట. గతంలో భారత ప్రభుత్వ ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇదే విషయం వెల్లడైంది. మొత్తానికి సర్వే ప్రకారం చూస్తే.. లక్ష్యద్వీప్‌లో ఎక్కువగా 94.2 శాతం మంది, గోవాలో 92 శాతం మంది మహిళలు పెళ్లైన ఏడాది తర్వాత సెక్స్‌పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంబల్ల భర్తలు కోరినప్పుడల్లా శృంగారంలో పాల్గొనడం లేదట. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో 63 శాతం మంది, కశ్మీర్‌లో 65 శాతం మంది, ఏపీలో 79.3 శాతం మంది, తెలంగాణలో 84.9 శాతం మంది మహిళలు ప్రతిరోజూ లేదా వారంలో, నెలలో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.

Read More..

ఆడపిల్లల్లో సెక్స్ కోరికలు పెరుగుతున్నాయా.. ఈ వ్యాధి కారణం కావచ్చు..  


Similar News