Healthy Seeds:హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించే సూపర్ సీడ్స్.. లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!

ప్రస్తుత రోజుల్లో మానవ జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-07-22 12:50 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో మానవ జీవన శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మానవుడు తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. స్టడీ, జాబ్.. మనీ ఇదే లక్ష్యంగా పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా మిస్ అవుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు కారణంగా వ్యాధులు దరిచేరుతున్నాయి. దీంతో శరీరంలోని హార్మోన్ల లెవల్స్ తగ్గడం లేదా పెరగడం జరగుతుంది. కాగా హార్మోన్స్ సమస్యను నియంత్రించడానికి పలు రకాల సీడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరీ అవేటో ఇప్పుడు తెలుసుకుందాం..

నువ్వులు..

జింక్ కంటెంట్ అధికంగా ఉండే నువ్వులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వులు తిన్నట్లైతే ప్రాజెస్టెరాన్ సంశ్లేషణను మెరుగుపరుస్తుంది. అలాగే ఈస్టోజెన్ అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో హార్మోన్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

అవిసె గింజలు..

అవిసె గింజలు జీర్ణక్రియలో మెరుగుపరచడంలో మేలు చేస్తాయి. క్యాన్సర్‌తో పోరాడటానికి అండ్ మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచడానికి, ముఖం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండ రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, వెయిట్ లాస్ అయ్యేందుకు, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో బాగా పని చేస్తాయి. ఈ గింజలకు పవర్ హౌస్‌గా పిలుస్తుంటారు. వీటిలో ఉంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.

చియా విత్తనాలు..

చియా సీడ్స్ హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తాయి. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మంటను తగ్గించడం, ప్రేగు పనితీరును నియంత్రించడం అండ్ కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో మేలు చేస్తాయి.ప్రతి రోజూ చియా సీడ్స్ మీ డైట్ లో చేర్చుకుంటే మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాగా గుమ్మడి గింజలు తిన్నట్లైతే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైటోస్టెరాల్స్ అండ్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉండే గుమ్మడి గింజలు తీసుకుంటే హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నవారు వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు.

జనపనార విత్తనాలు..

వీటిలో ఒమేగా-3 అండ్ ఒమేగా-6 యాసిడ్స్ అధికంగా ఉంటాయి. జనపనా విత్తనాలు ప్రతి రోజూ తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతను కంట్రోల్ చేయొచ్చు. పైగా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా.

పొద్దుతిరుగుడు సీడ్స్..

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటే హార్మోన్లు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇవి గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలకు అవసరమైన మెగ్నీషియం అండ్ పొటాషియం కూడా పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉంటాయి.

మెంతి గింజలు...

మెంతిగింజలు వికారం, వాంతులు, తలనొప్పి, అతిసారం, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి.

 


Similar News