గృహిణులకు సూపర్ న్యూస్.. ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ హ్యాపీ!

వంటింటి గృహిణులు అనేక రకాల వంటలు చేస్తారు

Update: 2023-05-08 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: వంటింటి గృహిణులు అనేక రకాల వంటలు చేస్తారు కానీ.. వారికి తెలియని సులభమైన చిట్కాలు ఎన్నో ఉంటాయి. ఆ చిట్కాలను పాటిస్తే మీరు ఈజీగా వంట తయారు చేసుకొవచ్చు. అవేంటో చూద్దాం..

వంటింటి చిట్కాలు..

* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవదు.

* కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.

* మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుప వస్తువు ఏదైనా వేయాలి.

*బ్రెడ్ ప్యాకెట్‌లో బంగాళదుంప ముక్కలు ఉంచితే తొందరగా పాడవ్వకుండా ఉంటుంది.

* చేపలు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించే ముందు వెనిగర్‌తో కడిగాలి.

* పూరీలు రుచిగా కరకరలాడాలంటే కాస్త వాము సెనగ పిండి, బ్రెడ్ పొడి కలుపుకోవాలి.

* పాల మీగడ చక్కగా రావాలంటే పాలు కాసే ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.

* యాపిల్ ముక్కలను కట్ చేశాక రంగు మారకుండా ఉండాలంటే చాక్‌కు కొద్దిగా నిమ్మరసం రాసి తరువాత యాపిల్‌ను కోయాలి.

* కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కాస్త బియ్యం పిండి కలిపితే రుచిగా ఉంటుంది.

వంటింటి శుభ్రత కోసం..

* ఈగలు ఉన్న ప్రదేశంలో పసుపు కలిపిన నీళ్లను చల్లితే ఇక ఈగలే రాకుండా పోతాయి.

* బొద్దింకలతో ఇబ్బందిగా ఉంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చిగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకి బిద్దింకలు పారిపోతాయి.

* ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ వంటగది ఎంతో శుభ్రంగా ఉంచుకోవచ్చు.

Read more:

జాగ్రత్త..! Exercise చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే మీకు గుండె సమస్యలు ఉన్నట్లే..!!

Tags:    

Similar News