skin beauty : మేని సోయగాన్ని పెంచే సూపర్ ఫుడ్స్.. వీటిని తింటే మీ అందం రెట్టింపు అంతే !

అందం, ఆరోగ్యం వంటి విషయాల్లో ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరుగుతోంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే స్కిన్ డల్‌గా లేదా డ్రైగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తాము బ్యూటిఫుల్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.

Update: 2024-09-13 10:16 GMT

దిశ, ఫీచర్స్ : అందం, ఆరోగ్యం వంటి విషయాల్లో ఇప్పుడు అందరిలో ఆసక్తి పెరుగుతోంది. తగిన జాగ్రత్తలు పాటించకపోతే స్కిన్ డల్‌గా లేదా డ్రైగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తాము బ్యూటిఫుల్‌గా కనిపించాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ముఖ సౌందర్యాన్ని పెంచుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఇందులో భాగంగా మేకప్ వేసుకోవడం, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం చేస్తుంటారు. కానీ వీటిలో రసాయనాలు కలిసి ఉండటంవల్ల కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. వీటికి బదులు చర్మసౌందర్యాన్ని పెంచడంలో సహాయపడే పోషకాలు గల ఆహారాలపై దృష్టి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* నిపుణుల ప్రకారం.. చిలగడ దుంపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం మీ అందాన్ని పెంచుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో వృద్ధాప్య ఛాయలు పెరగకుండా అడ్డుకుంటాయి. నిగనిగలాడే ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. అలాగే జీడిపప్పు, బాదం, వివిధ రకాల నట్స్ అండ్ సీడ్స్ కూడా మేనిసౌందర్యాన్ని పెంచగలిగే పోషకాలను కలిగి ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, బయోటిన్, ప్రోటీన్ వంటివి ఉండటంవల్ల చర్మాన్ని అలెర్జీల నుంచి కాపాడుతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.

* విటమిన్ ఎ, సి, ఇ : చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా చేయడంలో విటమిన్ ఎ, సి, ఇ కీలక పాత్ర పోషిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అయితే ఇవన్నీ అవకాడోలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఆహారంలో భాగంగా ఈ కూరగాయను తీసుకోవాలి. స్కిన్ డల్‌గా మారడాన్ని, ముఖం లేదా చర్మంపై ముడతలను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కాలే, బచ్చలి కూర, పాలకూర వంటివి కూడా రెగ్యులర్ ఆహారాలలో భాగంగా తీసుకోవాని నిపుణులు సూచిస్తున్నారు. వీటితోపాటు గుమ్మడికాయ, దోసకాయ, యాపిల్, టొమాటో, పాలకూర, స్ట్రాబెర్రీ వంటివి కూడా తీసుకుంటూ ఉంటే వాటిలోని పోషకాలు మేనిసోయగాన్ని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.  

Tags:    

Similar News