కొడుకు రాశిలోకి సూర్యుడు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాల రాజుగా పిలుస్తారు.

Update: 2024-02-14 04:28 GMT

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని గ్రహాల రాజుగా పిలుస్తారు. సూర్యుడు తన కదలికను మార్చడం వలన ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. భాస్కరుడు ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు. మరో ఐదు రోజుల్లో, అనగా.. ఫిబ్రవరి 13, కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత ఆదిత్యుడు, కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా మూడు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి : సూర్యుడి సంచారం ఈ రాశి వారికి వల్ల మంచి ఫలితాలను ఇస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికి ఉపశమనం దొరుకుతుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఈ సమయం మంచిగా ఉంటుంది. మీ కెరీర్ ఇది వరకు కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ అప్పుల నుండి విముక్తి పొందుతారు.

కన్యా రాశి : ఆదిత్యుని రాశి మార్పు కన్యారాశి వారికి కొత్త అవకాశాలను తెస్తుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉండనుంది. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి మంచిగా ఉంటుంది.

మేషరాశి : ఈ రాశి వారికి సూర్యుని గమనం మంచిది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో, మీరు మీ సహోద్యోగులకు మద్దతు ఇస్తారు. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. పెండింగ్ పనులన్ని వెంటనే పూర్తవుతాయి.


Similar News